తెలుగు దేశం పార్టీకి మరొక సీనియర్ నాయకుడు గుడ్ బై చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, చంద్రబాబు సలహా మేరకు ఆమెరికా ఉన్నతోద్యోగం వదలి వచ్చిన చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా విశేషంగా కృషి చేశారు. నారాలోహిత్ కు కూడా ఆయన బాగా సన్నిహితుడు.
15 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నా సేవలకు గుర్తింపు రాలేదనే అసంతృప్తితో ఆయన ఉన్నారని చెబుతున్నారు. పార్టీలో
ఆయన ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కూడా పని చేశారు. అంతకు ముందు ఆయన అంతరిక్ష శాస్త్రవేత్త గా పని చేశారు. అమెరికాలోని మూడు విశ్వవిద్యాలయాలనుండి ఉన్నత చదువు పూర్తి చేశారు. తర్వాత ISRO / NASA, అమెరికన్ గవర్నమెంట్ లో పని చేశారు. 2004లో ఎన్నికల ముందు ఆయన పార్టీలో చేరారు.
తొలినుంచి చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న నాయకుడు.2004 లో దుగ్గిరాల నుండి మొదటిసారి శాసనసభకు పోటీచేశారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి జి. వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. బలమైన కాపు సామాజకవర్గం ప్రతినిధిగా పార్టీలో ఉన్నారు. ఆయన త్వరలో బీజేపీలో చేరతాడని అనుకుంటున్నారు.
(ఫోటో youtube నుంచి)