తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
దీని కోసం పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఎ.వి. శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.
ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తులసి, మరువం, దమనం, బిల్వం, పన్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు.
ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు.
ముందుగా టిటిడి ఈవో, ఇతర అధికారులు కలిసి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి పుష్పాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.
ఈ మధ్య గోవిందరాజస్వామి ఆలయానికి భక్తుల రాక పెరుగుతున్నది. సరాసరి రోజుకు 10 వేల నుండి 24 వేల మంది వరకు దర్శించుకుంటున్నారు.
ఈవిషయాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలకు వస్తున్న భక్తుల్లో మూడో వంతు మంది ఈ ఆలయానికి వస్తున్నారని ఆయన చెప్పారు. అందువల్ల ఆలయంలో భక్తుల సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని, భద్రత పెంచుతున్నామని కూడా ఆయన చెప్పారు.
మే 11 నుండి 19వ తేదీ వరకు వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఇందులో కూడా , భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఇందులో కూడా , భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
(ఫోటోలు TTD సౌజన్యం)