ఎర్రమంజిల్, సచివాలయ భవనాల కూల్చివేతలపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
ఈ కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ఈ రెండింటిని కూల్చకుండా ఆదేశాలుచేయాలని కోర్టులో సామాజిక కార్యకర్త పిటిషన్ పాడి మల్లయ్య పిటిషన్ దాఖలయింది.
దీనిని మీద విచారణచేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని లోని హైదరాబాద్ లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్ నిర్ణయాధికారం ఉంటుందని పిటిషనర్ కోర్టు కు తెలిపారు. సెక్షన్ 8 (2)(3) ప్రకారం భవనాలు శాంతి బద్రతలపై ఉమ్మడి రాజధాని లో గవర్నర్ కె అధికారం ఉంటుంది. చారిత్రక ,వారసత్వ,సాంస్కృతిక కట్టడాలు 100 ఏళ్ళ దాటితే వాటిని కూల్చడానికి వీల్లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
ఎర్రమంజిల్ చారిత్రక కట్టడమవుతుందా అని కోర్టు ప్రశ్నించినపుడు అలాంటి వివరాలు ప్రస్తుతం తమ వద్ద లేవని తర్వాత పూర్తి వివరాలు సమర్పిస్తామని పిటిషనర్ తెలిపారు. తదుపరి విచారణను బుధవారం కు వాయిదా వేసింది. అయితే, కోర్టు అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
కొత్త అసెంబ్లీ అవసరమేమిటి; ఎర్రమంజిల్ నుకూల్చాల్సిన అవసరమేమిటి అనే విషయాలతోపాటు కొత్త నిర్మాణాల ప్లాన్ లను కూడా సమర్పించాలని కోర్టు కోరింది. ఎలాంటి సమస్యలు లేని ప్రస్తుత అసెంబ్లీని ఎందుకు వదిలేయాలని కూడా కోర్టు ప్రశ్నించింది.
ఉమ్మడి రాష్ట్రానికే సరిపోయినపుడు విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణ అవసరాలకు ఎందుకు సరిపోవడం లేదు, 17 ఎకరాలలో సెక్రెటేరియట్ నిర్మించాల్సిన అవసరం ఏమిటి? అని కూడా కోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం ఏడు పిటిషన్ లు దాఖలయ్యాయి.
ఎర్రమంజిల్ భద్రంగా ఉంది…
ఇది ఇలా ఉంటే, ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ అర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) ఎర్రమంజిల్ బాగా దృఢంగా ఉందని, పాత బడలేని సూచించింది.కొద్ది గా రిపేర్లు చేసి, రెగ్యులర్ గా మెయింటెయిన్ చేస్తే ఈ భవనాన్నివినియోగించవచ్చని ఇంటాక్ తెలిపింది. ఇంటాక్ కు చెందిన బృందం కన్వీనర్ నేతృత్వంలో ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ తో కలసి 149 సంవత్సరాల పురాతనమయిన చారిత్రక కట్టడాన్ని సందర్శించింది. ఈ భవనం నిజంగానే పాతబడిపనికిరాకుండా పోయిందా అనే విషయాన్ని ఈ బృందం పరశీలించింది. ఇపుడు ఈ భవనం పాతబడినట్లు కనిపించేందుకు కారణం, దీనిని నిర్లక్ష్యం చేయడం, రిపేర్లను సరిగ్గా చేయకపోవడమేనని ఈ బృందం అభిప్రాయపడింది.