ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి రేపు పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదనను ప్రవేశపెడుతున్నారు.
బిజెపి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చినా ఆమె చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తామన్న ధీమాను ఆమె బడ్జెట్ తో కల్పించాలి. ఆమె ముందున్న ప్రధాన సవాళ్లేమిటో చూద్దాం.
1. భారతదేశం అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అనే ట్యాగ్ ను కోల్పోయింది. 2018-19 జనవరి-మార్చి కాలానికి జిడిపి 5.8 శాతానికి కుప్పకూలింది. ఇది గత అయిదు సంవత్సరాలకంటే తక్కువ. దీనితో fastest-growing-major-economy(FGME) అనే ట్యాగ్ పోయింది. 6.4 శాతం జడిపి తో చైనా ఇపుడు టాప్ కు చేరింది. భారతదేశాన్ని మళ్లీ FGME గా మార్చాలి
2. కేంద్ర ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్ గా ఉండి ఎన్నికల ముందు రాజీనామా చేసిన అరవింద్ సుబ్రమణియన్ ఒక కీలకమయిన రహస్యం బయటపెట్టాడు. భారతదేశంలో వృద్ధి రేటు గణాంక వివరాలను పెంచి చూపిస్తున్నారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన ఒక పత్రంలో వెల్లడించారు. 2011-12, 2016-17 లో ఇలా 2.5 శాతం ఎక్కువ గా అభివృద్ధి చూపారని ఆయన వెల్లడించారు. ఇది చాలా సీరియస్ వ్యవహారం. దీనిని అధిగమించి అంకెల గారడి కాకుండా భారత్ నిజమయిన అభివృద్ధి సాధిస్తుందని ఆమె రుజువు చేయాలి.
3, దేశంలోకి కొత్తగా విదేశీ పెట్టబడులు రావడం తగ్గిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) అందిస్తున్న వివరాల ప్రకారం కొత్త ప్రాజక్టులు రావడం 15 సంవత్సరాల కిందటి స్థాయికి పడిపోయింది. గత ఎప్రిల్ జూన్ నెలల్లో కొత్త ప్రాజక్టులు 87 శాతం తగ్గిపోయాయి. ఈ ఏడాది రు. 43,500 కోట్ల విలువయిన పెట్టుబుడులొస్తున్నాయని ప్రకటించారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ మొత్తం రు.3.4 లక్షల కోట్లు. విదేశీ పెట్టుబడులను ఆకట్టు కునే వశీకరణ మంత్రమేదో కనిపెట్టాలి. ప్రయోగించాలి.
4. FMCG (fast-moving-consumer-goods) రంగంలో ఉన్న కార్పొరేట్ కంపెనీల పనితీరు ఆశించినంతగా లేదు. డాబర్, గోద్రేజ్, హిందూస్తాన్ లీవర్ కంపెనీలు వెనకబడ్డాయి.
5. వీటన్నింటికితోడు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు BSNL, MTNL లను కష్టాలనుంచి కాపాడేందుకు రు. 74,000 కోట్ల సహాయాన్ని జూలై 3 న ప్రకటించారు.
మొత్తంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ నత్త నడకతో నడుస్తూ ఉంది. ఇది బలపడి వడివడిగా నడిచేందుకు కొత్త ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఏం టానిక్ ఇస్తారో చూడాడి.
6.పూర్తి స్థాయి మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె బడ్జెట్ తన మార్కుచూపస్తారని చాలా మంది ఆర్థిక పండితులు ఆశిస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ పూర్తిస్థాయి ఆర్థిక మంత్రి కాదు. ప్రధానిగా ఉంటూ కేవలం అదనపు బాధ్యతలే నిర్వర్తించారు.