ఎమ్మెల్యేగా తనకొచ్చే కోటి రూపాయల జీతాన్ని ప్రజా సంక్షేమంకోసం ఖర్చుపెట్టడతా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఐదేళ్లలో తనకొచ్చే కోటి రూపాయల జీతంతో చరిత్రలో నిలిచిపోయేలా ఓ కార్యక్రమాన్ని చేపడతానని,ఏ కార్యక్రమం చేపట్టాలనేదానిని అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని వివరించారు.
గతంలో ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నపుడు కూడా తన కొచ్చే వేతనం మొత్తాన్ని నియోజకవర్గం మీద ఖర్చుపెట్టానని, ఇపుడు పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఆనవాయితీని కొనసాగించాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.
అంతేాకాాదు,గతంలో లాగానే జనం మధ్య గడిపే విధానం కొనసాగుతుందని కూడా ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్ అధికారులకు పిలుపు ఇచ్చిన మేరకు తాను కూడా వారానికోరోజు ప్రజల మధ్యే గడుపుతానని చెప్పారు.
‘ప్రభుత్వ ఆస్పత్రిలోనో, హాస్టల్ లోనో.. రాత్రిపూట పల్లెనిద్ర చేసి అక్కడి సమస్యలు తెలుసుకుంటాను. నన్ను కలవడానికి వచ్చేవారు ఎవరైనాప్రేమతో రావాలి. బొకేలతో రావద్దు. పూలమాలలు, శాలువాలకు పెట్టే ఖర్చుని పేద విద్యార్థులకోసం, అనాథ పిల్లలకోసం, వృద్ధులకోసం ఖర్చు చేయండి,’ అని ఆయన చెప్పారు.