మహానటుడు ఎస్వీ రంగారావుకు షాకిచ్చిన విజయనిర్మల

బుధవారం నాడు మరణించిన ప్రఖ్యాత నటి , దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల  దక్షిణ భారత సినీరంగంలో సర్ ప్రైజుల మహారాణి. ఆమె జీవితంలో ప్రతిమలుపు ఒక సర్ ప్రైజే.
ఆమె వల్ల మహానటుడు ఎస్వీరంగారావు జీవితంలోమర్చిపోని షాక్ కు గురయ్యారు (కిందచదవండి).
ఆమె తెలుగు హీరోకి భార్యగా, తెలుగు మహిళగా స్థిరపడినా ఆమె తొలుత సినీరంగ ప్రవేశం చేసింది తమిళ చిత్రంతోనే.
ఆమె తెలుగులో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించినా,మొదటిది మలయాళ చిత్రమే.
హీరోయినా గా మంచి పేరు తెచ్చకున్నా, ఆమె మొదట హీరోయిన్ ప్రాత వేసింది మలయాళంలో.  ఆ తర్వాత తమిళంలో హీరోయిన్ గా నటించారు.చాలా ఆలస్యంగా తెలుగులో హీరో యిన్ అయ్యారు.
 మొదటి 15 సం. సినీజీవితంలో ఆమె పేరు వట్టి నిర్మల మాత్రమే.
ఆమెకు ప్రఖ్యాత నిర్మాత బిఎన్ రెడ్డి  ఒక అందమయిన పేరు పెట్టారు. అయితే, ఆమె దానిని స్వీకరించలేదు.
ఆమె సీనీజీవితం పురుష పాత్రతొనే మొదయింది. తర్వాత తెలుగులో ప్రవేశించింది కూడా పురుష పాత్రతోనే.
అమె తొలిపేరు కేవలం ’నిర్మల’యే, విజయనిర్మల కావడం వెనక కథ ఉంది… వివరాలిక చదవండి.
(ఈ స్టోరీ నచ్చితే మీ మిత్రులందరికి షేర్ చేయండి. trendingtelugunews.com ఎదిగేందుకు చేయూతనీయండి. Positive Journalism ను ప్రోత్సహించండి.)
ఆమె 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రి రామ్మోహన్ రావు ది స్వస్థలం చెన్నై కాగా, తల్లి శకుంతలది గుంటూరు జిల్లా నరసరావుపేట. ప్రముఖ గాయని రావు బాలసరస్వతి  విజయనిర్మలకు మేనత్త కూతురు.
ఏడవ యేటనే ఆమె సినిమాల్లో నటించారు.1950లో ఆమె మత్స్య రేఖ అనే తమిళ సినిమాలో నటించారు ,1957లో తెలుగులో  ‘పాండురంగ మహాత్యం’ లో ఆమె బాలకృష్ణుడిగా నటించారు. బాల నటుడిగా ఆమె చివరి చిత్రం ‘భూ కైలాస్’.
ఆమె మద్రాసు (ఇపుడు చెన్నై)లోని ట్రిప్లికేన్ ఎన్ కెటి నేషనల్ గర్ల్స్ హై స్కూల్ లో చదువుకున్నారు. అక్కడే ఆమె నటన మీద ఆసక్తి కనబర్చారు. తిరువెంకట ముదలియార్ వద్ద ఆమె శాస్త్రీయ నృత్యం అభ్యసించారు.
ఒక రోజు ‘నువ్వు సినిమాల్లో నటించాలనుకుంటున్నావా?’ అని ఆమె తండ్రి స్నేహితులొకరు సరదాగా నిర్మలను అడిగారు. ఆమె అంగీకరించారు. దానితో ఆమెకు‘మత్స్యరేఖ’ అనే సినిమాల్లో నటించేందుకు టిఆర్ మహాలింగం అవకాశమిచ్చారు.
ఆ చిత్రంలో ఆయనే హీరో. ఎస్ వరలక్ష్మి హీరోయిన్. ఈ చిత్రానికి పి పుల్లయ్య దర్శకుడు. ఈ సినిమా 1950 ఆగస్టు 11 విడుదలయింది. ఈ చిత్రంలో హీరో బాల్యం పాత్రలో ఆమె నటించారు. ఆయన పేరు చిన్నా మత్స్య రాజు. వరలక్ష్మి చెల్లెలు విమల హీరోయిన్ చిన్నప్పటి పాత్ర.
తర్వాత ఆమె మరొక రెండు తమిళచిత్రాలలో నటించారు. ఆమె తెలుగు ప్రవేశం ‘పాండురంగ మహాత్యం’తో మొదలయింది. అపుడు కూడా ఆమె పురుష పాత్ర, చిన్ని కృష్నుడు పాత్ర పోషించారు.
ఆమె హారోయిన్ గా మొదట ప్రవేశించింది మళయాళం చిత్రంతో. 1964లో ‘భార్గవి నిలయం’ చిత్రంలో ప్రేమ్ నజీర్ తో నాయిక పాత్ర పోషించారు. ఇది సూపర్ హిట్ అయింది. దీనితో ఆమెకు మలయాళంలో చాలా అవకాశాలు వచ్చాయి. ఇందులో ప్రముఖమయినవి ఉద్యోగస్థ, నిశాగంధి. ఆమె మొదట దర్శకత్వం వహించింది కూడా మలయాళంలోనే. ఆ చిత్రం పేరు కవిత (1973). తర్వాత దానిని తెలుగులో రీమేక్ చేశారు.
ఆమె జీవితంలో 1965 చాలా ప్రముఖమయింది. ఆమె సినీజీవితం ఒక కొత్త మలుపు తిరిగింది ఆ సంవత్సరంలోనే. ఆమె విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి చక్రపాణిల తో కాంట్రాక్టు కుదర్చుకున్నారు. వారు ఎంగ వీట్టు పెన్ తీస్తున్నారు. అది తెలుగు ‘షావుకారు’కు రీమేక్. ఈ చిత్రం తర్వాతే, ఆమె విజయ నిర్మల అయ్యారు.
ఈ సినిమాలో ఒక చిత్రమయన సంఘటన జరిగింది. సినిమాలో ప్రముఖపాత్ర పోషిస్తున్న ఎస్ వి రంగారావు కు విజయ నిర్మల నచ్చలేదు. అమ్మాయి చాలా బక్కగా ఉందని, అందువల్ల హీరోయిన్ రోల్ కు పనికిరాదని, ఇలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయడం తప్పని విమర్శించారు.
దీనితో ఇక హీరోయిన్ అవకాశాలు రావని నిర్మల భయపడ్డారు. మరుసటి రోజు నాగిరెడ్డి ఆమెను స్టూడియోకు పిల్చారు. ఆ రోజుషూటింగ్ క్యాన్సిల్ చేశారు. అయితే, జరిగింది మరొకటి.
షాకింగ్. సినిమానుంచి ఎస్ వి రంగారావునే వాళ్లు తొలిగించి, ఎస్ వి సుబ్బయ్య అనే తమిళనటుని ప్రవేశపెట్టారు. ఇది సూపర్ హిట్ అయింది. దీనితో ఆమెకు తమిళంలో అవకాశాలు బాగా పెరిగాయి.
ఆమె హీరోయిన్ గా మలయాళంలో ప్రారంభించి, తమిళంలోకి ప్రవేశించి విజయవంతమయ్యాకనే తెలుగులోనటించారు.
రంగుల రాట్నం సినిమాలో నటిస్తున్నపుడు ఆమె పేరును బిఎన్ రెడ్డి నీరజగా మార్చారు. అయితే, ఆమె విజయ నిర్మలగానే స్థిరపడ్డారు. విజయనిర్మలాగానే యాక్టర్, డైరెక్టర్, నిర్మత గా అభిమానుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
ఆమె 200సినిమాలలో నటించారు. ఏడవ యేటనే ఆమె సనిమాల్లో నటించారు.1950లో ఆమె మచ్చ రేఖ అనే తమిళ సినిమాలో నటించారు ,1957లో తెలుగు పాండురంగ మహాత్యం లో ఆమె బాలకృష్ణుడిగా నటించారు. మొత్తం ఆమె 25 మలయాళం, 25 తమిళ చిత్రాలలో నటించారు.
1972 నుంచి ఆమె 42 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించింది. ఇందుకుగాను ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించింది. 2008 లో రఘపతి వెంకయ్య నాయుడు అవార్డు అందుకుకున్నారు.
ఆమె తీసిన చిత్రాలల్లో మీనా కు చాలా మంచి పేరొచ్చింది.మహిళల సంఘర్షణను ఆమె గొప్పగా చిత్రీకరించే వారు.
2008 సంవత్సరంలో  తెలుగు సినిమా పరిశ్రమ కి ఆమె అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా తన సొంతమైంది.
తమిళ లెజెండ్ శివాజీ గణేషన్ సినిమాలకి దర్శకత్వం వహించిన రెండో మహిళ విజయనిర్మల కావడం విశేషం.
ఆమె  కంటే ముందు మహానటి సావిత్రి దర్శకత్వంలో శివాజీ గణేషన్ గారు నటించి ఉన్నారు.
విజయనిర్మల తమిళనాడు లో పుట్టారు. ఆమె తండ్రి సినిమా  ప్రొడక్షన్ విభాగంలో పనిచేసే వారు. విజయనిర్మల  మొదటగా కృష్ణమూర్తి అనే ఇంజనీర్ ని వివాహమాడారు వీరికి కలిగిన సంతానం ప్రముఖ తెలుగు నటుడు నరేష్.
కృష్ణమూర్తితో విడిపోయాక తర్వాత ఆమె సూపర్ స్టార్ కృష్ణ ని వివాహమాడారు. విజయనిర్మల (73) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడ్తున్నారు.బుధవారంనాడు  హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్స్ లో తుది శ్వాస విడిచారు.

 

(ఈ స్టోరీ నచ్చితే మీ మిత్రులందరికి షేర్ చేయండి. trendingtelugunews.com ఎదిగేందుకు చేయూతనీయండి. Positive Journalism ను ప్రోత్సహించండి.)