అమరావతిలో ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలకోసమ మని ’అక్రమం‘గా గత ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కట్టించిన ప్రజావేదిక చరిత్రలో కలిసిపోయింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో భారీ వర్షం కురుస్తున్నా ఈ లగ్జీరీ భవనాన్ని కూల్చివేస్తున్నారు. వర్షం వల్ల ఆటంకం కలుగుతున్నా ఈ వార్త రాస్తున్నపటికి దాదాపు 70 శాతం ప్రజావేదిక భవనాన్ని కూల్చివేశారు.
తొలుత ఈ భవనాన్ని బుధవారం నుంచి కూల్చివేయాలని భావించారు కానీ అనూహ్యంగా మంగళవారం నుంచే కూల్చివేతకు సన్నాహాలు చేశారు. అధికారులు, కూలీలను తప్ప ఏ ఒక్కరిని పోలీసులు లోనికి అనుమతించలేదు.
సీఆర్డీయే అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది.
గతంలో ఏ అధికారులైతే దగ్గరుండి ప్రజావేదిక నిర్మాణానికి పూనుకున్నారో అదే అధికారులు దగ్గరుండి భవనం కూల్చివేస్తున్నారు. అంటే అధికారులు ఏ ఎండలో ఏ గొడుగు వాడాలో బాగా పసిగట్టగలరు.