మెడిగడ్డ బ్యారేజ్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టును కొద్దిసేపటి కిందట లాంఛనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలు:
20 జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు
తాగునీటి కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు
నీటిని సరఫరా చేసే మార్గం పొడవు 1,832 కి.మీ
గ్రావిటీ ప్రెషర్ కాలువ పొడవు 1,531 కి.మీ
గ్రావిటీ టన్నెల్ పొడవు 203 కి.మీ
లిఫ్టులు 22, పంప్ హౌజులు 22
అవసరమయ్యే విద్యుత్ 4,627 మెగావాట్లు
అవసరమయ్యే విద్యుత్ స్టేషన్లు 19
400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 6
400 కేవీ భూగర్భ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ 1
22 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 8
132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 4
పాత ఆన్ లైన్ జలాశయాలు 5
కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు 19
కొత్త జలాశయాల నిల్వ సామర్ధ్యం 141 టీఎంసీలు
7 లింకులు , 28 ప్యాకేజీలుగా విభజించి ప్రాజెక్టు పనులు
ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, జర్మనీ, చైనా, జపాన్ దేశాల నుంచి పంపులు, మోటార్లు
ప్రపంచంలోనే అతిపెద్ద 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పంపులు
గోదావరి నీటిని 100 మీ. నుంచి 620 మీ. వరకు పంప్ చేసే కెపాసిటీ
ఒక రోజులో 21వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు
రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పంప్ హౌజుల నిర్మాణం
రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి సివిల్ నిర్మాణాలు
మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 115 కి.మీ గోదావరి పునరుజ్జీవనం
మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి జలాశయం వరకు 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులు
ఎల్లంపల్లి జలాశయం నుంచి మిడ్ మానేరు వరకు 3 ప్యాకేజీల్లో పనులు
మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు ప్యాకేజీ 9
మిడ్ మానేరు నుంచి కొండ పోచమ్మ వరకు 5 ప్యాకేజీల్లో పనులు
మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి, నల్లగొండ జిల్లాల వరకు 15,16 ప్యాకేజీ
కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిపి మొత్తం సాగులోకి 37,08,670 ఎకరాలు
గోదావరిలో నీటి లభ్యత 165 టీఎంసీలు
ఎల్లంపల్లి ప్రాజెక్టులో లభ్యమయ్యే నీరు 20 టీఎంసీలు
ఎల్లంపల్లి దగ్గర మొత్తం నీటి లభ్యత 215 టీఎంసీలు
ఆన్ లైన్ చెరువుల పరీవాహక ప్రాంత నీటి లభ్యత 10 టీఎంసీలు
ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల రీచార్జ్ 25 టీఎంసీలు
ప్రాజెక్టు వినియోగానికి నికరంగా నీటి లభ్యత 240 టీఎంసీలు
కొత్త ఆయకట్టుకు 134.5 టీఎంసీల నీరు
హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా కోసం 30 టీఎంసీలు
దారిపొడవునా గ్రామాలకు తాగునీరు 10 టీఎంసీలు
పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు
ప్రాజెక్టులో మొత్తం నీటి వినియోగం 237 టీఎంసీలు
5 నెలల పాటు రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోత
మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యం 16.17 టీఎంసీలు
అన్నారం బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యం 10.87 టీఎంసీలు
సుందిళ్ల బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యం 8.83 టీఎంసీలు
మేడారం జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 0.78 టీఎంసీలు
అనంతగిరి జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3.50 టీఎంసీలు
రంగనాయక సాగర్ జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3 టీఎంసీలు
మల్లన్నసాగర్ జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 50 టీఎంసీలు
మల్కపేట జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3 టీఎంసీలు
కొండ పోచమ్మ సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 15 టీఎంసీలు
గంధమల్ల జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 9.87 టీఎంసీలు
బస్వాపురం జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 11.39 టీఎంసీలు
కొండెం చెరువు నీటి నిల్వ సామర్ధ్యం 3.50 టీఎంసీలు
141 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో ఆన్ లైన్ జలాశయాలు నింపుకునే అవకాశం
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, తుపాకులగూడెం వరుస బ్యారేజీలతో గోదావరి సజీవం
150 కి.మీ మేర గోదావరిలో ఏడాది పొడవునా నీరు లభ్యం
కాళేశ్వరం ఎత్తిపోతల పరంపరలో మొదటి ఘట్టం మేడిగడ్డ బ్యారేజీ
85 గేట్లతో 1.63 కి.మీ వెడల్పుతో మేడిగడ్డ బ్యారేజీ
ఇప్పటివరకు 8.5 కోట్ల బ్యాగుల సిమెంట్ వాడకం
ప్రాజెక్టు కోసం 4.2 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ వాడకం
కోటీ 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వాడకం
ఎత్తిపోతల పథకంలో మొత్తం మట్టిపని 53 కోట్ల క్యూబిక్ మీటర్లు
కాళేశ్వరం ప్యాకేజీల నిర్మాణాల్లో పనిచేసిన 60వేల సిబ్బంది