కాళేశ్వరం అడుగుతోంది, తన్నీరు…. ఎక్కడని..?

కాళేశ్వరం అడుగుతోంది….. తన్నీరు…. ఎక్కడని..?
కడుపు కాల్చుకొని
కంటికి కునుకు లేకుండా..
చెప్పులు అరిగిపోయేలా
కాళేశ్వరం చుట్టూ భ్రమించావు
ఏమిలాభం….
ఇప్పుడు కాళేశ్వరం అడుగుతోంది…
తన్నీరు…. ఎక్కడని…

అలుపెరుగని పోరాట యోధుడవు
భీడు భూములను సాగు భూములుగా
మలచిన ధీరుడవు…
మేడిగడ్డపై మీసం మెలేసినోడవు
ఏమిలాభం…. ఇప్పుడు..
కాళేశ్వరం అడుగుతోంది..
తన్నీరు ఎక్కడని…

ఆరడుగుల బుల్లెట్ లా…
భూమిని బద్దలు కొట్టినోడవు
అన్నారం ఆనవాళ్లను
అందరికి అందిచ్చినోడవు…
ఏమి లాభం…. ఇప్పుడు
కాళేశ్వరం అడుగుతోంది…
తన్నీరు….. ఎక్కడని.

చూడచక్కని అందగాడవు
చిరునవ్వులు చిందించేటోడివి
సుడిగాలిలా సుందిళ్ల చుట్టూ తిరిగావు
ఏమి లాభం….. ఇప్పుడు
కాలేశ్వరం అడుగుతోంది…
తన్నీరు….. ఎక్కడని.

మాటల మాంత్రికుడు….
కార్మిక… కర్షకులను ఏకం చేశావు
ఎల్లంపల్లి లో గంగను ఎత్తిపోయాలని..
ఏమి లాభం… ఇప్పుడు
కాలేశ్వరం అడుగుతోంది
తన్నీరు…. ఎక్కడని.

మాట తప్పని మడమ తిప్పని మనిషిగా
సమ్మక్క ,సారలమ్మ సాక్షిగా
మేడారం ను జలకన్యల చేయాలని…
ఏమి లాభం… ఇప్పుడు
కాలేశ్వరం అడుగుతోంది
తన్నీరు…. ఎక్కడని.

తెలంగాణ ప్రజల మాట కోసం
హనుమంతుడిలా అడవిలో తిరిగాడు
రామజపం తో రామదుర్గను పూరించాడు
ఏమి లాభం…. ఇప్పుడు
కాలేశ్వరం అడుగుతోంది
తన్నీరు…. ఎక్కడని.

ప్రాజెక్టుల దగ్గరనే పవళించాడు
తెలంగాణ ప్రజానీకానికి వెలుగయ్యాడు
మద్య మానేరు లో అందరిని మైమరిపించాడు
ఏమి లాభం… ఇప్పుడు
కాలేశ్వరం అడుగుతోంది
తన్నీరు…. ఎక్కడని.

ఓ ఋషిలా తపస్సు చేశాడు
గిరులను తవ్వుకుంటూ పోయాడు
అనంత గిరులలో ఆనంద భాష్పాలు పూయించాడు
ఏమి లాభం…. ఇప్పుడు
కాలేశ్వరం అడుగుతోంది
తన్నీరు…. ఎక్కడని.

కావలి కారుల కాపలా కాశాడు
పేదోల్లా భూములలో దేవుడయ్యాడు
ఇమాంబాద్ లో అందరి హృదయాలను గెలిచాడు
ఏమి లాభం… ఇప్పుడు
కాలేశ్వరం అడుగుతోంది
తన్నీరు…. ఎక్కడని.

ఉడుము పట్టుల పట్టుకున్నాడు
కన్నీళ్లను కడుపులో దాచుకున్నాడు
గంగాదేవిని మల్లన్న సాగర్ లో వదిలాడు
ఏమి లాభం….ఇప్పుడు
కాళేశ్వరం అడుగుతోంది
తన్నీరు…. ఎక్కడని.

ఎన్నో రాత్రులు కలలు కన్నాడు
గ్రామాలు పచ్చగా పండాలని
కొండపోచమ్మ దగ్గర చిందులేశాడు
ఏమిలాభం… ఇప్పుడు
కాళేశ్వరం అడుగుతోంది
తన్నీరు… ఎక్కడని.

మీరు ఒంటరి వాళ్ళు కాదు
మీ ఆశయం ఆవిరైపోదు
మీ కష్టం వృధా కాదు
తెలంగాణ ప్రజల అండవుండగా
మీ ఋణం తీర్చుకునే అవకాశం
తెలంగాణ ప్రజలకు
వస్తుందని ఆశిస్తూ…..

 

(సోషల్ మీడియా నుంచి )