తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడిని నియమించబోతున్నట్లు ఒక వార్త వైరలవుతూ ఉంది.
పార్టీ నుంచి దీనిని ధృవీకరించకపోయినా, పార్టీ లో సంస్థాగత మార్పలుంటాయని, పార్టీకి కొత్తరూపు ఇచ్చేందుకు జాతీయ అధ్యక్షుడు పూనుకుంటారని మాజీ మంత్రి ఒకరు ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ కు చెప్పారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విదేశీ యాత్ర నుంచి తిరిగిరాగానే పార్టీ ని సమావేశం పరిచి ఈ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
చంద్రబాబు రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేశ్ మధ్యాంధ్రలో ఉన్నా. కాబట్టి అధ్యక్షపదవిని ఉత్తరాంధ్రలకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పార్టీ పరాభవం తర్వాత సంస్థాపరంగా ప్రక్షాళనచేస్తారని అపుడు అధ్యక్షుడు కళావెంకటరావు స్థానంలో రామ్మోహన్నాయుడిని నియమిస్తారని అంటున్నారు.
ఇది మంచి నిర్ణయం లాగా కనిపిస్తుంది పైకి. పార్టీ అధ్యక్ష పదవి అంటే పేరు వినగాపే హోదా కనిపించాలి. స్టేచర్ ఉండాలి.రామ్మోహన్ నాయుడి అనుభవం సరిపోతుందా?
రామ్మోహన్ నాయుడు పార్లమెంటరీ పనితీరు బేష్ గానే ఉంది. ఆయన చాలా మంది కంటే మెరుగు. చాాలా తొందరగా ఢిల్లీలో అందరికంటా పడ్డారు. మంచిగుర్తింపు తెచ్చకున్నారు, అనుమానం లేదు. సీనియర్లంతా గోడ దూకే అవకాశాలు కనిపిస్తున్నందన శ్రీకాకుళం కుర్రన్నాయుడిగా పేరున్న ఎర్రన్నాయుడి కుమారుడిని పార్టీ అధ్యకుడిగా చేయడం తప్పని సరి అవుతుందేమో.
ఎర్రన్నాయుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడి ఉన్న రోజుల్లో న్యూఢిల్లీలో ఆయన బంగళా 9, సఫ్దర్ జంగ్ రోడ్ ఎపుడూ బిజీ గా ఉండేది. నాకు తెలిసినంతవరకు 7,రేస్ కోర్స్ రోడ్డు (ప్రధాని నివాసం)తర్వాత అంత రాజకీయ సందడి ఈ బంగళాలోనే కనిపించేది.
ఆరోజు రామ్మోహన్నాయుడు నిక్కరేసుకునే అటూ ఇటూ తిరిగే వాడు. అందుకే అప్పటి రాజ్యసభ సభ్యుడు, కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ముద్దుగా కుర్రన్నాయుడు రామ్మోహన్ ని అని పిలిచే వాడు.
పార్టీ విధేయతకు సంబంధించి రామ్మోహన్ తండ్రిలాగే అనుమానించడానికవ వీల్లేని వాడు. అయితే, ఆయన్ని తమ వైపులాగేందుకు వైసిపి ప్రయత్నాలు మొదలుపెట్టిందని కూడా చెబుతున్నారు.
రామ్మోహన్ నాయుడిని లోక్ సభాపక్ష ఉప నాయకుడిగా చంద్ర బాబు నియమించారు. కుమారుడు లోకేష్ పరాజయం పాలయినందున కొద్ది రోజులు పార్టీని కుటుంబానికి దూరంగా ఉంచేందుకు ఆయనకు రాష్ట్ర పార్టీ శాఖ బాధ్యతలు ఇవ్వబోతున్నారని చెబుతున్నారు.
అసెంబ్లీలో పార్టీ ఉపనాయకుడిగా బాబాయి అచ్చన్నాయుడు, పార్టీకి అధ్యక్షు డి రామ్మోహన్నాయుడు … ఇది ఆచరణ సాధ్యమా?
ఒక కుటుంబం పోయి మరొక కుటంబం వచ్చిందనే అపవాదు రాదా?
ఆంధ్రప్రదేశ్ టిడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అందువల్ల ఆయన కొనసాగకపోవచ్చు. ఫలితంగా కొత్త నాయకుడు అవసరమే. కమ్మవారిని నియమించే అవకాశం లేదు.
మరొక ఆప్షన్, కాపులనుంచి ఎవరినైనా అనుభవజ్ఞడిని నియమిస్తారా?
ఎవరిని నియమించినా గెలిచి సత్తా చాటిన వారినే నియమించాలి. ఈ ప్రాతిపదికన కుర్రవాడు, భవిష్యత్తు ఉన్నవాడు అని రామ్మోహన్ ను నియమిస్తారా? అసలు విషయం చంద్రబాబు తిరిగొచ్చాక గాని వెల్లడి కాదు.