బంగారం ధర గురువారం నాడు విపరీతంగా పెరిగింది. పదిగ్రాముల ధర రు.280 రుపాయలు పెరిగి రు. 34,000 దాటింది. ప్రపంవ్యాపితంగా బంగారుకు వాతావరణం అనకూలంగా ఉండటం,దేశీయ మార్కెట్ లో డిమాండ్ పెరగడంతో ఇలాధరలు పెరిగాయని సరాఫ అసోషియేషన్ ప్రకటించింది. గురువారం నాడు బంగారం ధర పది గ్రాములకు రు. 34,020 లకు పెరిగింది.
వెండి కూడా బంగారు బాటలోనే నడిచిందది. కిలో మీద రు.710 లు పెరిగి రు.39,060 లకు చేరింది. గత అయిదేళ్ల ఇలా పెరగడం ఇదే మొదలు. అంతర్జాతీయంగా కూడ బంగారు ధర ఇలాగే ఉంది. న్యూయార్క్ లో ఔన్స్ ధర $1,385.54 ధర పలికితే వెండి ధర $15.35 లకు చేరుకుంది.