రాణిఅవంతి బాయ్ విగ్రహం ఏర్పాటు గురించి నిన్న అర్థరాత్రి పోలీసులకు, గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కి మధ్య గొడవయింది. గొడవలో రాజా సింగ్ గాయపడ్డారు. పోలీసులు దాడి చేస్తే తనకు గాయాలయ్యాయని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. కాదు, ఆయన రాయితో తలమీద కొట్టకుని గాయం చేసుకుని పోలీసులమీద ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
గొడవెందుకు జరిగిందంటే, రాత్రి బాగా పొద్దుపోయాక రాణి 1857నాటి స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి అవంతి బాయ్ లోద్ పాత విగ్రహం స్థానే కొత్త విగ్రహం పెట్టేందుకు రాజాసింగ్ ప్రయత్నించారు.
దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో గొడవయింది. ఇందులో రాజాసింగ్ తలకి గాయమయింది. అయితే విగ్రహం మార్చేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని పోలీసు అధికారులంటున్నారు. ఈ గొడవ ఈ తెల్లవారుజామున 1.30 గం. సమయంలో జరిగింది.
గోషామహల్ నియోజకవర్గం హైదరాబాద్ ఓల్డ్ సిటిలో ఉంటుంది. ఎపుడై ఎంఐఎం గెలవని వోల్డ్ సిటీ నియోజకవర్గం ఇదే.
ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన ప్రజలెక్కువగా ఉంటారు. రాజాసింగ్ కూడా ఇలా వచ్చిన వాడే. ఈప్రాంతంలో ఆయన చాలా పేరుంది. వివాదాస్పదన ప్రకటనలు చేసి ఎపుడూ వార్తల్లో ఉంటారు.
ఆ మధ్య పాకిస్తాన్ సైన్యం తాను రాసిన గీతాన్ని కాపి చేసిందని వివాదం రేకెత్తించి జాతీయ వార్తయ్యారు.
ఇంతకీ ఆయన నిలబెట్టాలనుకున్న రాణి అవంతి బాయ్ ఎవరో తెలుసా?
హైదరాబాద్ దూల్ పేట్ ఏరియాలోని గంగాబౌళిలో రాణి అవంతీబాయ్ లోద్ భవనం కూడా ఉంది. ఈమధ్య ఇది హిందూ కార్యకలాపాలకు కేంద్రమయింది.
శ్రీరామ నవమిశోభాయాత్ర, హనుమాన్ జయంతి ఉత్సవాలు, ఇతర బైక్ ర్యాలీలు ఇక్కడి నుంచి మొదలవుతుంటాయి.
రాణి అవంతి బాయ్ గురించి…
అవంతి బాయ్ ని చరిత్రలో ఒక వీరనారిగా కీర్తిస్తారు. ఆమె రామ్ గడ్ సంస్థానం రాణి. మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వీర నారీమణులలో ఆమె ఒకరు.
ఆమె 1931లో జన్మించారు. మధ్య ప్రదేశ్ లోని మండ్ల జిల్లాలో ఒకపుడు రామ్ గడ్ సంస్థానం ఉండేది. దానిని పరిపాలిస్తున్న విక్రమాధిత్య లోద్ భార్య అవంతి బాయ్.
చిన్నప్పటి నుంచిఆమెకు స్వతంత్ర భావాలుండేవని చెబుతారు. రాజవంశంలో పుట్టినందున ఆమె కత్తిసాము, విలువిద్య,, గుర్రపు స్వారీ, యుద్ధవ్యూహాలు,రాయబారాల వంటిరాచ విద్యలన్నింటిలో శిక్షన పొందారు.
విక్రమాధిత్య అనారోగ్యంతో ఉండటంతో రామ్ గడ్ సంస్ధానం పాలనాబాధ్యతలను ఆమె స్వీకరించారు. విక్రమాధిత్య చనిపోయాక ఆమె పూర్తి పాలకు రాలు అయ్యారు.
1848లో లార్డ్ డల్ హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ తీసుకువచ్చిన విషయం తెలుసు కదా. ఈ చట్టం ప్రకారం, వారసుడు లేకపోతే, ఆ రాజ్యాన్నిఈ స్టిండియా కంపెనీ స్వాదీనం చేసుకుంటుంది.
అవంతీబాయ్ కి కూడా సంతానం లేదు. అందువల్ల 1851లో ఈస్టిండియా కంపెనీ రామ్ గడ్ ని కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కిందికి తీసుకువచ్చారు. కోర్ట్ ఆఫ్ వార్డ్ అంటే వారసులు లేని సంస్థాలను పాలించేందుకు ఏర్పటాయిన కమిటీ.
ఇది తన సంస్థానాన్ని కభళించేందుకు బ్రిటిష్ వాళ్లు చేస్తున్నగా కుట్ర అవంతి బాయ్ భావించారు.
కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కింద కంపెనీ నియమించిన అడ్మినేష్ట్రేటర్ ఆమె తరిమేసింది. బ్రిటిష్ వాళ్ల మీద యుద్ధం ప్రకటించింది.
వెంటనే చుట్టుపక్కల ఉన్న సంస్థానాలకు రాయబారులను పంపి అన్యాయంగా రాజ్యాలను కభళించేందుకు కంపెనీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా తాను చేస్తున్నయద్ధానికి మద్దతునీయాలని కోరారు.
ఇతర రాజులను బ్రిటిష్ వారికి వ్యీతిరేకంగా కూడగడుతున్నట్లు గ్ర హించిన కంపెనీ అధికారులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఆమె ఇరుగుపొరుగు రాజులకు రాసిన లేఖలో ని పదజాలం వాళ్లకి బాగా కోపం తెప్పించింది.