అమెరికా అయొవా లో సుంకర చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల మరణాల గురించి ఆసక్తి కరయమయిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భార్యపిల్లలను కాల్చి తర్వాత చంద్రశేఖర్ (చందు) తనను తుపాకితో కాల్చుకుని చనిపోయినట్లు తెలిసింది. వారి మృతదేహాల మీద పోస్టు మార్టం జరిపిన పోలీసులు కూడా చంద్రశేఖర్ సుంకర భార్య లావణ్యను, తర్వాత పిల్లలను కాల్చిచంపాడని, ఆతర్వాత తను కాల్చుకుని చనిపోయాడని చెబుతున్నారు.
స్నేహితులు చెబుతున్న వివరాలకు ప్రకారం కొంతకాలంగా చంద్రశేఖర్ మానసిక అశాంతికిలోనయి ఉన్నాడు. దీనికితోడు కుటుంబతగాదాలు కూడా తోడయిన ఉండవచ్చని అనుకుంటున్నారు. చంద్రశేఖర్ ఈ మధ్యనే ఏప్రిల్ 22 న తుపాకి పర్మిట్ సంపాదించారు. ఈ విషయాన్ని డల్లాస్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ ధృవకరీచింది.
చంద్రశేఖర్ గుంటూరు జిల్లాకు చెందిన వాడు. ఆయన ఇద్దరు అక్కలు హైదరాబాద్ లో ఉంటున్నారు.
కాల్పులు జరిపేటప్పటికి ఇంట్లో నలుగురు బంధులువుకూడా ఉన్నారు. దెక్కన్ క్రానికల్ కథనం ప్రకారం భార్యపిల్లలతో పాటు అత్తమామలను కూడా ఆయన శుక్రవారం నాడు డిన్నర్ కు తీసుకువెళ్లాడు. ఇంటిబేస్ మెంట్ లో వారంతా కలసి ఒక సినిమా కూడా చూశారు.
శనివారం జామున రెండున్నరగంటలపుడు మొదట లావణ్యను కాల్చేశాడు. తర్వాత మొదటి అంతస్థులో నిద్రిస్తున్న పిల్లలిద్దరిని చంపేశాడు. ఈ తుపాకి పేలిన శబ్దానికి బేస్ మెంటుల్ నిద్రపోతున్న ఆయన మరదలు, పిల్లలు మేల్కొన్నారు. అయితే, ఎక్కడో బయటజరుగుతన్న కాల్పుల శబ్దాలని చందు బుకాయించి వాళ్లకి సర్ది చెప్పాడు. తర్వాత ఆయన అపస్టెయిర్స్ కు వెళ్లి కాల్చుకుని చనిపోయాడు,’ అని ఆయన స్నేహితులు చెప్పినట్లు దక్కెన్ క్రానికల్ రాసింది.
నిజానికి ఆయనకు పెద్దగా ఆర్థిక ఇబ్బందులుండేవికాదు. అయితే ఈ కొత్త ఇల్లు కొన్నాక ఆయనకొద్ది ఇబ్బందులో పడ్డారని స్నేహితులు చెబుతున్నారు. ఇదే విధంగా పెద్ద కొడుకు అనారోగ్యం కూడా ఆయనను పీడిస్తూ ఉందని స్నేహతులు చెబుతున్నారు. ఈ మానసిక క్ష్యోభతోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని బంధువులు స్నేహితులు అనుమానిస్తున్నారు.
చంద్రశేఖర్ అమెరికా పౌరుడు.