ఈ రాత్రి క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మీడియా కు వెల్లడించిన విశేషాలు:
1. సెక్రెటేరియేట్, అసెంబ్లీలు కొత్తగా నిర్మించాలని నిర్ణయించాం. ఎర్రమంజిల్ వద్ద ఉన్న 17 ఎకరాలలో కొత్తగా అసెంబ్లీ, కౌన్సిల్, సెంట్రల్ హాల్ లు అద్బుతంగా నిర్మిస్తాం.నిర్మాణం, అంతర్జాతీయ స్థాయి ఫర్నీఛర్ తో కలసి దాదాపు 100 కోట్లవుతుందని అంచనా వేశారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ఈ నెల 27న భూమి పూజ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
2. కొత్త సెక్రెటేరియేట్ కు 400 కోట్ల లోపే ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లను పూర్తిచేసి జూలై నెలలో ఎన్నికలు పూర్తి చేస్తాం, సీఎం కేసీఆర్ .
3. త్వరలో కేబినెట్ సమావేశం నిర్వహించి ఉద్యోగుల పీఆర్సీ, రిటైర్ మెంట్ వయస్సు పెంపు పై నిర్ణయం తీసుకుంటాం, ఉద్యోగ సంఘాల నేతలతో దీనిపై చర్చిస్తాం,
4. శారదాపీఠానికి 2 ఎకరాలు కేటాయిస్తున్నాం. దర్శకుడు ఎన్ శంకర్ కు హైదరాబాద్ శివారులో 5 ఎకరాలు కేటాయిస్తాం. రాష్ట్రంలోని 31 జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తాం. ఖమ్మం లో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉంది, వరంగల్ రూరల్ పై అక్కడి ప్రజాప్రతినిధులతో, మంత్రితో చర్చించాల్సి ఉంది.
ఇంకా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చెప్పారంటే…
సచివాలయం ఉన్న చోట నే నిర్మిస్తాం.5 నుండి 6 లక్షల ఎస్ ఎఫ్ టి నిర్మాణము కోసం 400 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. అసెంబ్లీ భవనం కూడా మరో 100 కోట్లు అవుతుంది. పార్లమెంట్ భవనాల తరహా నిర్మాణం నిర్మించాలని చూస్తున్నాం. ఇప్పుడు నిర్మించే అసెంబ్లీ భావనం కూడా అదే తరహా ఉంటుంది. సచివాలయంలో ఉన్న అన్ని భావనలు కులగొట్టాల లేక ఉంచాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాలి.ఇప్పుడు నిర్మించే భవనం అద్భుతమైన నిర్మాణం జరుపుతాం.