హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సుంకర చంద్రశేఖర్ (44), ఆయన భార్య లావణ్య చంద్రశేఖర్ (41), 15, 10 సంవత్సరాల ఇద్దరు పిల్లలు దారుణ హత్య కుగురయ్యారు.
అమెరికా అయొవా లోని వెస్ట్ డెస్ మొయినెస్ శివారు కాలనీ 65 వ స్ట్రీట్ లోని 935 నెంబర్ ఇంటిలో ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసులకుసమాచారం అందిందని హెవీ.కామ్ రాసింది.
ఈ దారుణం ఎలా జరిగిందో అంతుబట్టడం లేదు. ఆయొవా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్, వెస్ట్ డెస్ మోయిన్స్ డిటెక్టివ్ లు రంగంలోకి దిగారు. 15 తేదీన ఉదయం 10 గంటలకు సుంకర కుటుంబ సభ్యులు హత్యకుగురై ఉండటం చూసిన బంధువొకరు పోలీసుకు పోన్ చేసి ఈ విషయం చెప్పారు.
ఆ రోజు సుంకర నలుగురు బంధువులను అతిధులుగా ఇంటికి ఆహ్వానించారు. వచ్చిన బంధువులలో ఒక వ్యక్తి బయటకు వెళ్లి, దారినపోయే ఒకరి ద్వారా పోలీసుల ఫోన్ నెంబర్ 911 కు ఫోన్ చేయించారు.
అయితే, ఈ బంధువులు హత్య జరగడాన్నిస్వయంగా చూశారా అనే విషయం తేలడం లేదు. సుంకర కుటుంబ సభ్యులు తుపాకితో కాల్చినందునే చనిపోయారని పోలీసులు ధృవీకరించారు. చంద్రశేకర్ ఫేస్ బుక్ పేజీ నుంచి అతని గురించి పోలీసులు కొంత సమాచారం సేకరించారు.
చంద్రశేఖర్ హైదరాబాద్ లోని మాటూరి వెంకట సుబ్బారావ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. 1996 కోర్సు పూర్తి చేశారు. ఆయన అయొవా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ వారి టెక్నికల్ సపోర్ట్ బ్యూరోలో పనిచేస్తున్నారు.
ఆయనకు జీతం 105,104 అమెరికన్ డాలర్లు.డిపార్ట్ మెంట్ కు మంచిసేవలందించినందుకు 2010లో ఆయనకు గవర్నర్స్ ఎక్స్ లెన్స్ అవార్డు వచ్చింది. ఈ పోటోని ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. చంద్రశేఖర్ కుటుంబం మార్చి 25 ఇక్కడి ఇంటికి మారారు. ఈ యాష్ వర్త్ ఎంక్లేవ్ లో ఉన్న ఈ ఇంటిని 570,000 అమెరికన్ డాలర్లకు కొన్నారు.