చంద్రుని ముద్దాడబోతున్న తొలి మహిళ…

మొత్తానికి ఒక మహిళ తొలిసారి గా చంద్రుని ముద్దాడబోతున్నది. అమెరికాకు తొలిసారి జ్ఞానోదయం అయింది. ఇంతవరకు పురుషులను మాత్రమే చంద్రుడి మీద పంపించాం, మహిళను ఎందుకు పంపలేదని గుర్తించింది. దీనికి 50 సంవత్సరాలు పట్టింది.
చంద్రుడి మీద తొలిసారి మానవుడు కాలుమోసిన 50
సంత్సరాలకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒక మహిళనుకూడా పంపాలని ఇపుడు నిర్ణయించింది.
2024 నాటికి ఈలక్ష్యం నెరవేరేలా ప్రణాళిక వేసుకుంది. భవిష్యత్తులో అంగారకుడి మీదికి మనుషుల్ని పంపేందుకు అమెరికా సమాయత్తమవుతూన్న సంగతితెలిసిందే.
అంగారక యాత్ర కోసం చంద్రుడిని ఒక శిబిరం లాగా వాడుకునేందుకు అమెరికా తయారవుతూ ఉంది. అక్కడ రకరకాల ప్రయోగాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఒక మహిళ కూడా పరిశోధకులటీమ్ లోఉండాలని అమెరికా భావిస్తున్నది.
ఇపుడు రిక్రూట్ మెంట్ మొదలుపెట్టింది. ఒక మహిళను చంద్రుడిమీదకు పంపే ఈ ప్రాజక్టు పేరు అర్టిమిస్. ఆర్టిమిస్ అంటే అపోలో కవల సోదరి. చంద్రదేవత. ఈ పేరు ఎందుకు పెట్టారంటే, 1969లో తొలి వ్యోమగామి (పురుషుడు)ని చంద్రునిమీదకు పంపిన ప్రాజక్టు పేరు అపోలో. ఇపుడు మహిళను పంపిస్తున్నందున దీనికి అర్టిమిస్ అని పేరు పెట్టారు.
నాసా1969 నుంచి 1972 వరకు చందమామయాత్రకు 12 మంది పంపించింది. వీరంతా పురుషులే. ఇపుడు మొట్టమొదటి చందమాయ యాత్రికురాలిని ఎంపిక చేసేందుకు 12 మంది అభ్యర్థినులను సిద్దం చేశారు.
వీరిలో ఒకరికి ఈ యోగం దక్కనుంది. వీరంతా 40-53 సంవత్సరాలున్న వయసున్నవారు. వీరిలో మాజీ సైనిక పైలట్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు ఉన్నారు.
అమెరికా అంతరక్ష పరిశోధనాకేంద్రం (NASA)1958లో ఏర్పాటయింది. సాధారణంగో అంతరిక్ష యాత్రకు మిలిటరీ వాళ్లేనే రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. అందునా మగవాళ్లకు మాత్రం ప్రాధాన్యం ఇచ్చే వాళ్లు.
1983 దాకా అంతరిక్ష యాత్ర పురుషలకే పరిమితమయింది. ఆ యేడాది శాలి రైడ్ అనే మహిళను నాసా అంతరిక్షంలోకి పంపింది.
తర్వాత 2013 మరొక నలుగురు మహిళలను ఎంపిక చేశారు. వీళ్లంతా 40,41 సంత్సరాల వయసు వాళ్లే. 2020లోపు వీళ్లంతా ఎపుడో ఒక సారి అంతరిక్షంలోకి వెళ్లి వస్తారు.
ఇపుడు ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ లో ఇద్దరు మహిళలున్నారు. వీరి పేర్లు ఏన్ మెక్ క్లైన్,క్రిస్టినా కోక్. ఇందులో కోక్ 11 నెలల పాటు స్పేస్ లొ ఉంటూ దీర్ఘ కాలం అంతరిక్షంలో ఉన్న మహిళగా రికార్డు సృష్టించబోతున్నారు. ఆమె పర్వతారోహకురాలు.
ఫోటో గురించి: ఇది చంద్రుడి మీద దగిన వ్యోమగామి బజ్ ఆల్ డ్రిన్ ఫోటో. ఆయన లునార్ మాడ్యూల్ పైలట్. మాడ్యూల్ కాలి దగ్గిర నిలబడుకుని ఉన్నారు.ఈ మాడ్యూల్ పేరు ఈగిల్. ఇది అపోలో 11 మిషన్ . అల్ డ్రిన్ చంద్రుడి మీద నడుస్తున్నపుడు మరొక వ్యోమగామి నీల్ అర్మస్ట్రాంగ్(మిషన్ కమాండర్ ) 70 ఎం.ఎం ల్యూనార్ సర్ ఫేస్ కెమెరా తో ఈ పోటో తీశారు. ఈ ఫోటో గురించిన పూర్తి సమాచారం Apollo Lunanr Surface Journalలో దొరుకుతుంది.

 

(Healthy Reading కోసం trendingtelugunews.com ఫాలో కండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి)

.