విశాఖ శారదా పీఠం భావి బాధ్యతలను ఇరవై ఆరేండ్ల బ్రహ్మచారి కిరణ్ కుమార శర్మ(బాలస్వామి)కి అప్పగిస్తున్నారు.
ఈ మేరకు పెద్ద స్వామి, శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, నిర్ణయించారు.
బాల స్వామికి శిష్యతురీయాశ్రమ దీక్షను ఈ నెల 15, 16, 17 తేదీల్లో బాలస్వామి సన్యాసాశ్రమ స్వీకరణ విజయవాడ కృష్ణానదీ తీరాన ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గతీర్థం వేదిక జరుగుతుంది.ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్త కోటి తరలి వస్తున్నారు.
ఆదిశంకరుడు, సచ్చిదానంద దేవేంద్రుడు, అద్వైతానందేంద్రుల పరంపరగా శారదీపీఠం నడుస్తున్నది. దీనికి ఉత్తరాధికారిగా కిరణ్ కుమార శర్మ వ్యవహరించబోతున్నారు. అపుడే సన్యాస నామం వెల్లడిస్తారు.
ఇది ఇలా ఉంటే, శంకరాచార్యుల మార్గంలో పయనిస్తూ, అద్వైతాన్ని బోధిస్తూ… ఆధ్యాత్మికతను వ్యాప్తి చేస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ నేడు కృష్ణా నదీ తీరానికి చేరారు. శారదా పీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవాన్ని చేపట్టారు. విజయవాడలోని కృష్ణా నది కరకట్టపై శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లను సిమ్స్ డైరెక్టర్ భరత్ రెడ్డి, డాక్టర్ బి.శివ శిరీషలు పర్యవేక్షిస్తున్నారు.
ఆఖరి రోజు 17న బాల స్వామి వారికి యోగ పట్టా అనుగ్రహించే కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, తెలంగాణా సీఎం కేసీయార్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ హాజరవుతున్నారు.
దీని కోసం అమరావతి కరకట్ట పై గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఏర్పాట్లను దేవాదయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగిరమేష్ పరిశీలించారు. గుంటూరు రేంజి ఐ.జి. రాజీవ్ కుమార్ మీనా, ఎస్పీ రాజశేఖర్ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.