తెలంగాణ శాసన సభల్లో కాంగ్రెస్ ను టిఆర్ ఎస్ లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసన మండలి చైర్మన్, కార్యదర్శి, ఎన్నికల కమిషన్ లకు హైకోర్టు నోటీసులు పంపిచారు. ఇదే విధంగా టిఆర్ ఎస్ లో విలినమైన ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలితకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదే విధంగా తమ వాదన విన్నాకే విలీనం పై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని గతంలో భట్టి, ఉత్తమ్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి నోటీసులు జారీ చేశారుు.
సుధీర్ రెడ్డి, చిరుమర్ధి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, సబిత, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, సురేందర్ రెడ్డి లకు కూడా హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం రెండు కేసులను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
విలీనం ఆమోదిస్తూ స్పీకర్ జారీ చేసిన బులెటిన్ రద్దు చేయాలని తాజాగా భట్టి, ఉత్తమ్ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.