రూలింగ్ పార్టీలు ప్రతిపక్ష పార్టీలలో ఫిరాయింపులను ప్రోత్సహించడం జరగుతూ ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత రాజకీయాలు ఫిరాయింపులతోనే వర్ధిల్లుతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. ఫిరాయింపు భారత ప్రజాస్వామ్యానికి ఇపుడు గుండెకాయ. ఒక్కొక్కసారి గుండెకోత కూడా అవుతూ ఉంటుంది. ఈ రాజకీయానికి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా బలయింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత ఫిరాయింపులను ప్రోత్సహించడం మీద తీవ్రంగా ఆవేదన చెందారు. మండిపడ్డారు. ఎలాగో టీ న్యూస్ సౌజన్యంతో వీడియో వీక్షించండి