పోలీసు కేసులకు భయపడి ఇంతకాలం అజ్ఞాతంలో గడిపిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తాజాగా తెర ముందుకు వచ్చారు. హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసిన రవి ప్రకాష్ … కోర్టులు మొండి చేయి చూపడంతో హైద్రాబాద్ పోలీసుల ముందు లొంగిపోయారు.
మంగళవారం 5 గంటల పాటు పోలీసులు విచారణ చేశారు. బుధవారం కూడా విచారణకు పిలిచారు. పోలీస్ విచారణ తర్వాత రవి ప్రకాష్ కామెంట్స్…
టీవి9 ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుకున్నారు.
నాపై దొంగ కేసులు పెట్టారు. ఇద్దరు మాఫియా పెద్దలు దొంగపనులు చేసి టీవీ9లో అక్రమంగా జొరబడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నన్ను అక్రమంగా టివి9 నుంచి బయటికి పంపించారు.
పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.
పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాను.
ఇది మాఫియాకు మీడియాకు మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధం.
ఈ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుంది. ప్రజలు గెలుస్తారు.