హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఖాళీ అయింది. ఉమ్మడి రాజధాని చాప్టర్ అధికారికంగా ముగిసినట్లే. పార్లమెంటు చట్టంలో ఇంకా ఉమ్మడి రాజధాని అనే మాట కొనసాగినా ఈ రోజుతో ఆచరణలో ఆ చాప్టర్ ముగిసింది. ఎందుకంటే, హైదరాబాద్ లో ఉమ్మడి రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉంది. నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కుదరిన మౌఖిక వప్పందంతో గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు భవనాలను కేటాయిస్తారు.
ఇందులో ఒకటి పోలీసులకోసం, మరొక టి ఇతర శాఖ ల కోసం వినియోగిస్తారు.
రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు పని చేస్తుందని విభజనం చట్టంలో పేర్కొన్నారు. దీనికి తగ్గట్టుగా హైదరాబాద్ సెక్రెటేరియట్ లో ఉన్న భవనాలను రెండురాష్ట్రాలకు కేటాయించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు.
దీనితో హైదరాబాద్ సెక్రెటేరియట్ లో కోట్లు ఖర్చు పెట్టి ముస్తాబు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర భవనాలన్నీ నిర్వహణ లేక మట్టి కొట్టుకుపోతున్నాయి. ఇది దెబ్బతినే ప్రమాదం ఉందని,అందువల్ల వాటిని మాకు వెనక్కు ఇవ్వాలని తెలంగాణ క్యాబినెట్ ఈ రోజు తీర్మానించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సత్సంబంధాలున్నందున ఈ సమస్య క్షణాల్లో సెటిల్ అయింది.
శనివారం నాడు హైదరాబాద్ లో ఇఫ్తార్ విందు కోసం రాజ్‌భవన్‌కు వచ్చిన ఏపీ సీఎం జగన్, గవర్నర్ నరసింహన్ సమక్షంలో సీఎం కేసీఆర్ ఈ విషయంపై చర్చలు జరిగినట్లు విశ్వసనీయంగా తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు జగన్ అనుకూలంగా స్పందించడంతో గవర్నర్ వెంటనే స్పందించారు. ఈ రోజు తన ఉత్తర్వులు విడుదల చేశారు. ఇదే ఉత్తర్వు.