ప్రముఖ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ
మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు వెన్నముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు.
వైద్యుల సూచన మేరకు వెంటనే వెన్నముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన… వారం రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారునిన్న రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మురళీమోహన్… ప్రస్తుతం తన నివాసంలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిని వీడియో…
ఇది ఇలా ఉంటే ప్రముఖ మెగా స్టార్ చిరంజీవి భార్యసురేఖతో కలసి మురళీ మోహన్ ను పరామర్శించారు. మురళీ మోహన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.