తన ఓటు ఎవరో వేశారని నల్లగొండ జిల్లా చండూర్ మండలంలోని తెరేటపల్లి ఎంపిటిసి సంయుక్త ఆరోపించారు. శుక్రవారం స్థానిక కోటాలో ఎమ్మెల్సీకి ఉప ఎన్నికలు జరిగాయి. అయితే సంయుక్త ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగా ఆమె ఓటు పోల్ అయిందని అధికారులు చెప్పారు.
దింతో సంయుక్త కంగుతున్నారు. తన ఓటు ఎవరు వేశారు? అసలు అంత గుడ్డిగా అధికారులు ఎలా అనిమతించారు అని సంయుక్త ప్రశ్నించారు.
ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సంయుక్త ఆవేదన ఏంటో కింద వీడియో చూడండి.