నిన్న ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారిక సమీక్షలు మొదలయ్యాయి. తొలిసమీక్షకు ఆయన ప్రతిష్టాకరమయిన మధ్యాహ్న భోజన పథకం ఎంచుకున్నారు. ఎందుకంటే, ఆయన ప్రభుత్వ పాఠశాల మీద ఉన్నఅనుమానాలు అపోహలు పొగొట్టి అందరి దృష్టి ఈ పాఠశాలల వైపు మళ్లించడానికి చాాలా ప్రాముఖ్యం ఇస్తున్నార.
ఈ మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ మధ్యాహ్న భోజన పధకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేశారు.
మధ్యాహ్న భోజన పథకం అమలులో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి వినూత్నంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ అమలుచేయాలని ఆయన సూచించారు.
ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా ఈ పాఠశాలలను ఈ పథకంతో తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం పాఠశాలలవైపు ప్రజల దృష్టి మళ్లేలా స్కూల్స్ లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలని, మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడవద్దని ఆయన అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలని ఆయన చెప్పారు.
ఇది ప్రాథమిక సమావేశమేనని మళ్ళీ సమావేశం లోపు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాలని ఆయన అధికారులను ఆదేశించారు.