విజయవాడ నగరంలో భారీ వర్షము, ఈదురు గాలులకు జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని వీక్షించెందుకు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ చిందరవందర అయింది. కేశినేని భవన్ పక్కన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ హోర్డింగ్స్ కుప్ప కూలింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
బెజవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తడిసి ముద్దై0ది.
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ సభా ప్రాంగణం. ప్రాంగణాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు.
కింద వీడియోలు ఉన్నాయి చూడొచ్చు.
బెజవాడలో వర్షం పై సీనియర్ జర్నలిస్ట్ చిన్న విశ్లేషణ కింద ఉంది చదవండి.
” వరుణుండు మా పార్టీ ” అని పెద్దాయన దివంగత ప్రియతమ నేత మాటలు మళ్ళీ రుజువయ్యాయి. విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ మంచి మార్పుకు శుభసూచకంగా బుధవారం రాత్రి కృష్ణాజిల్లాలో జగనన్న ముఖ్యమంత్రిగా ప్రజలు భారీ ఎత్తున పట్టం కట్టడంపై వర్షం తన హర్షం ప్రకటించింది.. చల్లని గాలులు జననేతకు వింజామరలు విసిరాయి.. వస్తున్నా.. వస్తున్నా.. మీ కోసం వస్తున్నా.. మీ గుండె మంటల్ని చల్లార్చడానికి వస్తున్నా.. మీ బిడ్డగా.. మీలో ఒకడిగా.. వస్తున్నా.. అంటూ సంకల్ప సిద్ధుడై అలుపెరుగని బాటసారిలా జనం మధ్య తిరిగి నేడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార మహోత్సవానికి శ్రీ జగన్మోహనరెడ్డి గారు విజయవాడకు వస్తున్న సందర్భంలో మిత్రులందరికీ ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు !! —— ఎన్. జాన్సన్ జాకబ్ , ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.