వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి టీడీపీ అధినేత చంద్రబాబును హుందాగా ఆహ్వానిస్తే దానికి ఇతర కథనం జోడించి సొంత మీడియాలో రాయించుకున్నారని వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మండి పడ్డారు.
రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జగన్ ఫోన్ చేసి చంద్రబాబును ఆహ్వానించారు.అయితే, చంద్రబాబు నాయుడు వెళ్లకుండా ఒక ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్నారు.
దీని మీద ట్వీటర్ వేదికగా చంద్రబాబు తీరుపై విజయ్ సాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా?
మీ సలహాలు అవసరం, మీరు అనుభవజ్ణులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా?
మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే ప్రజలు యువనేతకు పట్టం కట్టారు.
నువ్వు మారవు బాబూ.’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనువజ్ణులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే యువనేతకు పట్టం కట్టారు ప్రజలు. నువ్వు మారవు బాబూ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 29, 2019
జగన్ గారు అత్యున్నత సంప్రదాయాన్ని పాటించి స్థానిక/జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సిఎంలను ఫోన్ ద్వారా ఆహ్వానించే సమయంలో నేను పక్కనే ఉన్నా. మీకూ నాముందే ఫోన్ చేసారు. కానీ ఆయన మీ అనుభవం, సలహాలు అవసరం అనే మాటలే వాడలేదు.ఆయన అనని మాటల్ని అన్నట్టు ప్రచారం చేసుకునేంత నీచానికి దిగారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 29, 2019