రేపు బాధ్యతలు స్వీకరించునున్న మోదీ ఎన్డీఎ మంత్రి వర్గంలో మాజీ అర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేరే అవకాశం లేదు. ఆరోగ్య కారణాల వల్ల ఆయన ప్రభుత్వ బాధ్యతలనుంచికొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. లేఖను ట్విట్టర్ లో విడుదల చేశారు.
‘గత 18 నెలలు సీరియస్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్ల కృషి వల్ల చాలా సమస్యలనుంచి బయటపడ్డాను. ఎన్నికల ప్రచారమంతా ముగిసి మీరు కేదార్ నాథ్ వెళ్తున్నపుడు, ఎన్నికలపుడు మీరు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించగలిగినా, భవిష్యత్తులో, కొంత కాలం, బాధ్యతలను నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు మీకు మాటపరంగా చెప్పాను. దీని వల్ల నా ఆరోగ్యం మీద, చికిత్స మీద దృష్టి పెట్టేందుకు వీలవుతుంది…. అందువల్ల నా చికిత్సమీద దృష్టిపెట్టేందుకు వీలుగా నాకు వీలుకల్పించాలని, ప్రస్తుతానికి ఏ బాధ్యతలను పంచుకోలేనని చెప్పందేకు ఈ లేఖ రాస్తున్నాను,’ అని జైట్లీ లేఖలో పేర్కొన్నారు.
I have today written a letter to the Hon’ble Prime Minister, a copy of which I am releasing: pic.twitter.com/8GyVNDcpU7
— Arun Jaitley (@arunjaitley) May 29, 2019