టాలివుడ్ పెద్దలు కొత్త సీఎం జగన్ ను అభినందించరా?

టాలివుడ్ అంటేనే హంగామా అట్టహాసం. ఇలాంటి టాలివుడ్ రెండు రోజులుగా మౌనంగా ఉంది. రాష్ట్రంలో ఒక మహత్తర చారిత్రక ఘట్టం ఎదురయినా టాలివుడ్ పెద్దల్లో కదలిక లేదు.  ఇది మౌనమా? లే షాకా?
ఎందుకంటే,తెలుగు నాట ఎన్నికలు ముగిశాయి. ఒక ప్రజాస్వామిక ప్రక్రియ పూర్తయింది. తెలుగు సినిమాలను విపరీతంగా ఆదరించి నిర్మాతలను కోట్లకు పడగలెత్తించిన తెలుగు ప్రజలు ఒక భూకంపం సృష్టించే ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లు ఒక యువకుడికి ఓటేసి అఖండ విజయం సాధించి పెట్టారు.జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిచేయబోతున్నారు. ఎవరికి ఇష్టమున్నా లేక పోయినా ఇదిప్రజాస్వామిక తీర్పు. అంతా గౌరవించాల్సిందే. జగన్ వోటేసిన వారిలో సినిమా హీరోల అభిమానులున్నారు, సినీ అభిమానులున్నారు. వారి ప్రజాస్వామిక తీర్పును గౌరవించరా? ఈ ప్రశ్న వేస్తున్నారు. ఒక జగన్ అభిమాని, ఒకప్రజాస్వామిక వాది. ఆయన రాసిన బహిరంగ లేఖను ఇక్కడ అందిస్తున్నాం.
అయ్యో , తెలుగు సినీ అనుకుల పెద్దలారా!
ఏది జరగకూడదనుకున్నారో అదే జరిగిందా ? నోట మాట పెగలటం లేదా ? రికార్డు మెజారిటీతో గెలిచిన జగన్ ను అభినందించడానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ రాయలేకపోతున్నారా ? బొడ్డుమీద బొప్పాయిలు కొట్టి , వయసుడిగిన తరువాత భక్తి మార్గంలో ఎస్ వీ బీ సీ భక్తిని పట్టిన దర్శకేంద్రుడి కళాత్మక దృష్టికి ఇంకా జగన్ గెలుపు కనపడలేదా ? సకల సామాజిక చైతన్య మారథాన్ లలో ముందుండి నడిపించే దక్షిణ భారత తెలివయిన నిర్మాత దగ్గుబాటి సురేష్ ఇంకా జగన్ గెలుపును గుర్తించలేదా ? బాబు ఉత్తుత్తి ఉద్యమాలకు ఊపిరులూది నల్లబ్యాడ్జీలు పెట్టుకోవడాన్నే మహోద్యమంగా భావించి పొద్దున విమానంలో వెళ్లి మద్యాహ్నం విమానంలో విజయవాడనుండి హైదరాబాద్ కు వెనక్కు వచ్చి మీడియాలో వార్తలు రాయించుకున్న జెమినీ కిరణ్ , వైజయంతి అశ్వనీ దత్తు , ట్రెండు సెట్టు కే ఎల్ నారాయణలు ఇంకా బాబే గెలిచాడని అనుకుంటున్నట్లున్నారు . అక్కినేని నిత్య మన్మథుడు తెలివిగా ఒక ట్విట్టునయినా ట్విట్టాడు . నిర్మాతలకే నిర్మాత , నిర్మాతల తాతలకు తాత అయిన అల్లూ అరవింద్ కు ఇంకా జగన్ గెలుపు వార్త ఎవరూ చెప్పనట్లు లేరు . ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ రాజ్యంలో కలిపి ఊపిరి పీల్చుకున్న చిరంజీవి చెవిన జగన్ గెలుపు వార్త ఇంకా ఎవరూ వేయలేదేమో ?
బాబు గెలుపు సంరంభ సన్నాహ సందోహాలను వేయి కెమెరాలతో రికార్డు చేసి గోదావరి పుష్కరాల్లా జాతికి అంకితం చేద్దామనుకుని ముందే విజయవాడ నోవాటెల్ హోటల్లో దిగిన బోయపాటికి బాబు గెలవలేదని చెప్పేవారెవరు ? ఇలా చెబుతూ పొతే ఈ దృశ్యం 24 ఫ్రేముల్లో పట్టనంత పెద్దది.
అయ్యా , బాబూ !
మీరు గుర్తించినా గుర్తించకపోయినా వై ఎస్ జగన్ జన నేత . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి . అభినందిస్తే మీకు సంస్కారం మిగులుతుంది . అభినందించకపోతే అతను వై ఎస్ ఆర్ కాదు పోనిలే అని వదిలేయడానికి . ప్రతిదీ రికార్డు అయి ఉంటుంది . నిన్న చెప్పాడు కదా ? బాబు లాక్కున్న 23 ఎం ఎల్ ఏ , ముగ్గురు ఎం పి ల లెక్క ఎలా ఫలితంగా వచ్చిందోనని . అలా మీ ఫలితం కూడా లెక్కగా ఏదో ఒకనాడు చెప్పకపోడు . అమంగళము అప్రతిహతమవుగాక . ఇక బాబు మీద రాయండి పాటలు , తీయండి యాడ్ లు , చూపండి ఎద్దును ఆవుగా , పందిని నందిగా , నందిని పందిగా . మీ చేతిలో బాబు భవిష్యత్తు సర్వనాశనం ఎలా అయ్యిందో తెలుసుకునేలోపే మీరందరూ జగన్ పంచన చేరి అనాదిగా వై ఎస్ ఆర్ సీ పీ ని భుజాన మోస్తున్నది మీరే అని ప్రతి ఫొటోలో , ప్రతి దృశ్యంలో కనిపిస్తుంటారని వేల కోట్ల బెట్టింగులు పెట్టారు . 2004 లో వై ఎస్ గెలిచిన మరుక్షణం బాబుభజన సినీ బృందం ఎలా ప్లేటు ఫిరాయించి వై ఎస్ కాళ్ల దగ్గర చేరిందో ఉదాహరణల వీడియోలు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి . లగడపాటి దెబ్బకు సర్వం కోల్పోయిన బెట్టింగ్ రాయుళ్లను మీరు మళ్లీ రోడ్డున పడేయకండి . సిగ్గు – నిస్సిగ్గు కేవలం భాషలో పదాలు . వాటికి ఏమంత విలువలేదు .
రావాలి జగన్
కావాలి జగన్ రాసి కోట్ల హృదయాల్లో ప్రతిధ్వనింపజేసిన సుద్దాలకు అభినందనలు . మాటల తూటాలతో సిగ్గులేనివారిని కడిగిపారేసిన పోసానికి కృతఙ్ఞతలు . జగన్ వెంట నడిచిన థర్టీ ఇయర్స్ పృథ్వికి , ఎస్ వీ కృష్ణారెడ్డిలాంటి ఎందరో ?అందరికీ పేరు పేరునా అభినందనలు .
– ఒక వై ఎస్ అభిమాని
 ఇది కూడా చదవండి…

https://trendingtelugunews.com/jagan-reminds-pm-modi-of-special-category-status-to-andhra-pradesh/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *