ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికొద్ది సేటి కిందట న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తొలిసమావేశంలో నే ఆయన ప్రధానికి రాష్ట్రప్రజల డిమాండ్ ప్రత్యేక హోదా గురించి గుర్తు చేశారు. ప్రధానితో జరిగిన సమావేశంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలన్నింటిని అమలుచేయాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అదే నని ఆయన ప్రధానికి చెప్పారు.
జగన్ వెంటన రాష్ట్రప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తో పాటు ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నందిగం సురేశ్, భరత్, బాలశౌరి తదితరులు ఉన్నారు.
ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మోదీకి జగన్ మొదట శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్. మే 30న అమరావతిలో జరిగే తన పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు.