FLASH
ఈ లోక్ సభ ఎన్నికల్లో పరాజయ కారణాలను సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమయింది. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తారనే వదంతుల మధ్య ఈ సమావేశం జరగుతూ ఉంది. ఏమౌతుందోనని అంతాఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఎంతో కాలంగా కుటుంబ ఆస్తిగా కొనసాగుతూ వచ్చిన అమేధీ నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ వోడిపోయారు. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ కు సున్న మిగిలింది. దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలు మట్టి కరిచారు. ఈ దారుణ పరిస్థితి ఎందుకు ఎదురయిందో పార్టీ సమీక్షించాలనుకుంటున్నది.