(ప్రశాంత్ రెడ్డి)
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చాలా మంది తీర్పు ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ప్రశంసించారు.
ఈ రోజు గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు మూడు పులులను లోక్ సభకు పంపిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
కాంగ్రెస్ నుంచి లోక్ సభకు గెలిచిని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఆయన అభినందించారు.
‘ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా పోటీ చేశారు. గెలిచారు. నిజానికి ఎనిమిది స్థానాలు గెలుస్తామని అనుకున్నాం. మూడే సీట్లే గెలిచాం. అయితే, మూడు పులులు గెలిచాయ్,’ అని గెలిచిన అభ్యర్థులను పులులతో పోల్చారు.
‘తెలంగాణ లో కాంగ్రెస్ సేఫ్ జోన్ లో ఉంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు చాలా మంచి తెలివయిన తీర్పు ఇచ్చారు,’ అని ఆయన అన్నారు.
‘భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలు గెలిచినందున కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెబూతూ టిఆర్ ఎస్ మాత్రం డేంజర్ జోన్ లో పడింది,’అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎపుడూ రెండు పార్టీల మధ్య జరిగే ఎన్నికలు ఇప్పుడు మూడు పార్టీల మధ్య జరిగాయి. 2018 లో రెండు పార్టీల మధ్య ఎన్నికలు జరిగాయి. 2024 లో కూడా మూడు పార్టీల మధ్య జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ మారరు. భవిష్యత్ లో చాలా మంది టిఆర్ ఎస్ నాయకులు బీజేపీ లోకి వెళుతారని ఆయన అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతారని ఆయన గెలిచిన అసెంబ్లీ స్థానంలో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.