ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి కూడా ఒకటి. మంగళగిరికి మామూలుగా అయితే ఇంత ప్రాధాన్యత వచ్చే అవకాశం లేదు. మరి ఎందుకింత ప్రాధాన్యత దక్కిందంటే ఇక్కడ నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు కాబోయే ముఖ్యమంత్రి అని పేరొచ్చిన నారా లోకేష్ పోటీ చేయటమే.
అందుకే ప్రజలు ఉత్కంఠతో ఈ నియోజవర్గం ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఐటి కూడా అయిన మంత్రి లోకేష్ వైసిపి అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడికి ఆళ్ల గట్టి పోటీ ఇస్తున్నారు. లోకేశ్ మంగళగిరి కి రావడమ అక్కడ ప్రపంచ రాజధాని అమరావతి ప్రభావం ఉంటుందనే. అయితే, ఆళ్ల దీనిని వమ్ము చేసేలా ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం, ఈ నియోజకవర్గంలో ఆళ్ల చాలా పాపులర్. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి మీద గత అయిదేళ్లు గా విరామం లేకుండా న్యాయపోరాటం చేస్తూ నిరంతరం వార్తలో ఉన్న వ్యక్తి ఆళ్ల. ఆయన పబ్లిక్ రిలేషన్స్ లో లోకేశ్ కంటే చాలా పాపులర్. లోకేశ్ ముఖ్యమంత్రి కుమారుడనే తప్ప రాజకీయంగా ఆళ్లకు సాటిరారు.
అందుకే ఆయన గట్టి పోటీ ఇస్తున్నట్లు అర్థమవుతుంది. కొన్ని రౌండ్లలో లోకేశ్ ను వెనక్కు నెట్టారు, అయితే అపుడే ఫలితం వూహించలేం గాని లోకే
ష్ కు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఎందుకో గాని మొదటి నుండి లోకేష్ ఇక్కడ కష్టమనే వార్తలొచ్చాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆర్ధిక, అంగబలాలకు లోటు లేదు కాబట్టి ప్రచారంలో దూసుకు పోతున్నట్లు మీడియ ప్రొజెక్ట చేస్తూ వచ్చింది. అయితే ఆళ్ల కూడా తన దయిన శైలిలో తాను బలహానంకాదని రుజువుచేస్తూ వచ్చారు. పోలింగ్ చివరి గంటలో రెండు మూడు కేంద్రాల దగ్గర స్వయంగా లోకేషే ధర్నాలకు దిగాల్సి వచ్చింది. పవర్ సెంటర్ కు చెయిచాస్తే అందేంత దగ్గర లో ఉన్న మంగళగిరిలో ఈపరిస్తితి రావడం మంచిసూచిక కాదు.
ఈ ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత పోస్టల్ బ్యాలెట్లలోను ఆళ్ళకే ఆధిక్యత దక్కింది. చివరకు రెండో రౌండు ఈవిఎంల లెక్కింపు లో కూడా లోకేష్ వెనకబడ్డారు. ఒక్క లోకేష్ అనే కాదు మంత్రులు అచ్చెన్నాయడు, సోమిరెడ్డి చంద్రమొహన్ రెడ్డి, నారాయణ, నక్కా ఆనందబాబు, ఆదినారాయణరెడ్డి కూడా బాగా వెనకబడే ఉన్నట్లు సమాచారం అందుతూ ఉంది. అయితే, ఇంక చాలా రౌండ్లు లెక్కించాల్సి ఉంది.