ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇటువంటి గొప్ప విజయం ఎపుడూ ఎదురవలేదేమో అని వైసిపి అధినేత ఈ అసెంబ్లీ ఎన్నికల లో ప్రజలిచ్చిన అఖండ విజయం మీద స్పందిస్తూ పేర్కొన్నారు. కొద్ది సేపటి కింద మీడియాతో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి గా మే 30 ప్రమాణం చేస్తానని వెల్లడించారు.
ఈ విజయం ఎందుకు చరిత్ర సృష్టిస్తుందో ఆయన ఇలా చెప్పారు.
‘‘25కు 25 ఎంపి స్థానాలు వస్తున్నాయి.175 అసెంబ్లీ స్థానాలలో దాదాపు 153 రావడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నూతనాధ్యాయం. ఈ విజయం దేవుడిదయతో, ప్రజలందరి చల్ల ని దీవెనలతో సాధ్యమయింది. ఈ రోజు నేను మీ అందరి ఎదుట నిలబడి మాట్లాడగలగుతున్నానంటే అది నా అదృష్టం. ఈ విజయం నా బాధ్యతలను పెంచుతుంది. విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వోటు విశ్వసనీయతకు వోటు. విశ్వసనీయత లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వోటు తో చూపించారు. ప్రజలందరికి ఒకటే చెబుతున్నాను, అయిదుకోట్ల మందిలో దేవుడు ఒక్కరికే సిఎం అయ్యే అవకాశం ఇస్తాడు. అది నాకు వచ్చింది. అలాంటి అవకాశం వచ్చినపుడు గవర్నెన్స్ అంటే ఏమిటి, గొప్ప గవర్నెన్స్ ఎలా ఉంటుందనే చూపిస్తాను. ఆరు నెలలనుంచి ఒక సంవత్సరంలోనే ‘జగన్ ముఖ్యమంత్రి’ అని పేరుతెచ్చు కుంటాను. నా మీద విశ్వాసం ఉంచినంందుకు పేరుపేరునా అందరికి హృదయపూర్వకంగా రెండుచేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నాను.
3600 కి.మీ పాదయాత్రలో నేను చూశాను, నేను విన్నాను, అందుకే నేను ఉన్నాను అని హామీ ఇస్తున్నాను. నవరత్నాలు అందరికి అందుతాయి.’