ఏపీ రాజకీయాలలో కొత్త సీఎం జగన్ అని తేలిపోయింది! ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ లో వైసిపి చాలా దూరం వెళ్లిపోయింది. ఇక అది ఏమాత్రం మారే అవకాశాలు లేని స్థితికి అధికార టీడీపీ దిగజారిపోయింది. ఈ ఓటమి చారిత్రాత్మకం.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాబోతున్నది. కొత్త విధానాలు, కొత్త ప్రయారిటీలు ముందుకు వస్తున్నాయి.
ఈ క్రమంలో కొత్త సీఎం పదవిలోకి వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రాధాన్యత అంశాలను తనకు నివేదించాల్సిందిగా అధికారులను రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.
ఈ వివరాలను నూతన ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎస్ తెలిపారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు స్పష్టమైన ఉత్తర్వులు అందాయి.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం జగన్ ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తున్నది. ఈ నెల 25న వైసిపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగుతున్నదని చెబుతున్నారు.
శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి జగన్ ని నేతగా ఎన్నుకుంటారు. ఆపై కొత్త మంత్రివర్గంపై కసరత్తులు ప్రారంభిస్తారని సమాచారం!