రష్యా జనాభా రోజుకి ఏడువందల మంది చొప్పున తగ్గిపోతా ఉంది. అంటే సంవత్సరానికి 2,50,000 మంది తగ్గిపోతున్నారు.
యూరేషియా డెయిలీ మానిటర్ లెక్కల ప్రకారం ముర్మాన్ స్క్ వంటి నగరాలలో సోవియట్ యూనియన్ కూలిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా జనాభా 30 శాతం తగ్గిపోయింది.
ఆహార సమస్యతో పాటు బయటి ప్రాంతాలనుంచి వచ్చే వాళ్లెవరూ లేకపోవడం, జననాల సంఖ్య పడిపోవడం వంటి జనాభాసమస్యలు దీనికి కారణమని ఈ సంస్థచెబుతూ ఉంది.
కొంతమందేమో పాశ్చాత్య దేశాలు రష్యా మీద విధించిన ఆర్థిక అంక్షలు కారణమంటున్నారు. ఈ ఆంక్షల వల్ల దేశంలో పేదరికం పెరిగిందని, అభద్రత వ్యాపించిందని వారు వాదిస్తున్నారు.
2050 నాటికి రష్యా జనాభా ఇపుడున్న 146మిలియన్ల నుంచి 137 మిలియన్లకు పడిపోతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
అయితే, జనాబా పడిపోవడం ఇలాగేకొనసాగితే, భవిష్యత్తులో రష్యా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన దేశంలో మొదలయింది.
దేశం సుసంపన్నం, ప్రజలకు పేదరికం
రష్యాలో 13 శాతం మంది ప్రజల పేదరికంలో మగ్గిపోతున్నారు. ఐరిష్ టైమ్స్ పత్రిక వెల్లడించిన లెక్కల ప్రకారం రష్యాలో 19.3 మిలియన్లు ప్రజలు పేదరికంలో ఉన్నారు. దీనిని సగానికి తగ్గిస్తామని స్టేట్ ఆప్ ది నేషన్ ఉపన్యాసంలో దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
రష్యాలో జనాభా పడిపోవడాన్ని నివారించేందుకు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గృహాలు, ప్రాథమిక వసతుల మీద 25.7 ట్రిలియన్ రూబుల్స్ ఖర్చుచేస్తామని చెప్పాడు. ఒకటి మాత్రం కరెక్టు, రష్యా పేదరికం సోవియట్ రష్యా పడిపోయిన ప్పటినుంచి తగ్గిపోతూ ఉంది. అపుడు 35 శాతం ఉండింది.
రష్యా ఒక దేశంగా చాలా సంపన్నదేశం. ఈ దేశం దగ్గిర 460 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా రిజర్వు ఫండ్ ఉంది. జిడిపిలో రుణ భారం 29 శాతమే. ఇది ఇండియాలో 60.1 శాతం. చైనాలో 16 శాతం.వార్షిక ప్రగతి రేటు కేవలం 1.5 శాతమే ఉన్నా, అంతర్జాతీయంగా ఎంత భారీ షాక్ వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి రష్యాకు ఉందని నిపుణులు చెబుతున్నారు.