అమ్మాయిలను తాకడం, రాసుకుంటూ పోవడం, తడమడం బాగా రష్ ఉన్నపుడు సిటి బస్సులలో, సబర్బన్ రైళ్లలో తరచూ జరుగుతూ ఉంటుంది.
ఆ రద్దీలో గట్టిగా అరవడం సాధ్యం కాదు, అలాగే తడిమిన వాడిని పట్టుకుని చెంపవాయించడం కూడా సాధ్యం కాదు. అందుకే చాలా మంది అమ్మాయిలు, మహిళలు దీన్ని భరించి మౌనంగా వెళ్లిపోతూ ఉంటారు.
ఈ సమస్య ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా ఉంది.బాగా అభివృద్ధి చెందిన దేశం అని మనం భ్రమించే జపాన్ లో కూడ ఈ మాయ రోగం ముదిరింది.
ఇలావేధింపులకు గురయ్యే మహిళలకోసం ఒక యాప్ వచ్చింది. ఈ యాప్ ను యాక్టివేట్ చేస్తే సరి, ఇలా ఉద్దేశపూర్వకంగా తడిమే వాళ్లని పట్టిస్తుంది.
డిజి పోలీస్ (digi police app)యాప్ జపాన్ లో సూపర్ హిట్టయింది. ఎవరయినా ఆకతాయి తాకగానే, ఈ యాప్ ‘Stop It’ అని బిగ్గరగా అరుస్తుంది. లేదా SOS మెసేజ్ ( There is a molester, Please help) ను మొబైల్ స్క్రీన్ మీద ఫ్లాస్ చేస్తుంది. దానిని ఇతర ప్రయాణికులను చూపి ఆకతాయిని పట్టుకునేందుకు సహకరిస్తుంది.
టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ యాప్ ను ప్రజలు విపరీతంగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఇంతవరకు 237,000 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒక పబ్లిక్ సర్వీస్ యాప్ ను ఇంత మంది డౌన్ లోడ్ చేసుకోవడం చాలా అరుదని అధికారులు ఆశ్చర్య పోతున్నారు. ప్రతినెల దాదాపు 10 వేల మంది డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.
చాలా సందర్భాలలో బాధితులు తమ బాధను ఆ రద్దీలో వ్యక్తం చేయలేరు. అలాంటి వాళ్లు నిశబ్దంగా ఉంటూనే తోటి ప్రయాణికులను తమ మీద జరుగుతున్న దాడి గురించి అప్రమత్తం చేయవచ్చు.
టోక్యో రైళ్లు, సబ్ వేలలొో మహిళలను అసభ్యంగా తాకడం, తడమడం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. 2017లో ఇలాంటివి 900 కేసులు పోలీసులు దృష్టికి వచ్చాయి. టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్ మెంటు అధికారులు అసలు సమస్యలో ఇది గోరంత మాత్రమే అంటున్నారు. జపాన్ లో ఇలాంటి ఆకతాయిపనులకు ఆరునెలల వరకు జైలు శిక్ష, 5లక్షల యెన్ లదాకా జరిమానా ఉంటుంది.
టోక్యో పోలీసులు మూడేళ్ల కిందట ఈ ఉచిత Digi Police యాప్ ను లాంచ్ చేశారు. మొదట్లో ఈ యాప్ ను వృద్ధులకోసం పిల్లల కోసం రూపొందించారు.
తర్వాత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని గుర్తించే పంక్షన్ ను జోడించారు. నిజానికి యాప్ చాలా కాలం ఎవరికీ తెలియకుండా ఉండింది. ఒక సారి పాప్ సింగర్ ని అకతాయిల బారిపడింది. ఈ విషయంమీద చాలా హాటాట్ ఆనలైన్ చర్చ సాగింది. దీనితో యాప్ వూహించనంత పాపులర్ అయింది.
ఈ యాప్ ఇపుడు జపనీస్ భాషలో నే ఉంది. ఇంగ్లీస్ బటన్ నొక్కితే కొంత సమాచారం ఇంగ్లీష్ లో లభిస్తుంది.
ఈ యాప్ లో చాలా ఫంక్షన్లు న్నాయి. మిత్రుల కు మీకు జరిగిన ఫ్రాడ్ గురించి వెంటనే సమాచారం పంపవచ్చు, పర్సనల్ అలారమ్, పోలీస్ స్టేషన్ లను వెదికే సౌకర్యం, పోలీసుల ట్విట్టర్ ఫీడ్ కు చేరుకోవడం, మీ కేసుల మీద విాచారణ ఏదశలో ఉందో కూడా తెలుసుకోవచ్చు.