శ్రీహరికోట లో పీఎస్ఎల్వి సి-46 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు.ఈ ఉదయం ప్రయోగించిన 15.నిమిషాల 30 సెకన్లలోనే నిర్విఘ్నంగా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి షార్ శా స్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ ఏడాది ఇది వరసగా షార్ కు మూడో విజయం. ఇక అంతరిక్షం నుండి రిశాట్ 2 బి (రాడార్ ఇమేజింగ్ శటిలైట్ 2 బి) ఉపగ్రహం సేవలు లభిస్తాయి.ఇది భూమండలాన్ని పరిశీలించే ఉపగ్రహం. ఇది 5సంవత్సరాలు పని చేయనుంది. దేశానికి ఇది చాలా ముఖ్యమైన ఉపగ్రహమని ఇస్రో ఛైర్మన్ శివన్ చెప్పారు. 2009 లో ప్రయోగించిన రిశాట్ 2 స్థానంలో ఇది పని చేస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 615 కేజీలు. ఇది శ్రీహరి కోటనుంచి జరిగిన 48వ ప్రయోగం.
జూలై లో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని ఆయన వెల్లడించారు.
🇮🇳 #ISROMissions 🇮🇳
For those who missed watching the launch live, take a look at the majestic lift-off of #PSLVC46!
Mission accomplished successfully! pic.twitter.com/Nec1XkQ7bt
— ISRO (@isro) May 22, 2019