మనసుంటే మార్గముంటుందనేది ఎప్పటికి వాడిపోని నానుడి. ఇలా మనసుండబట్టే ఒక సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం కనిపెట్టి విజయవంతమయ్యాడు అరుణా శుభాకర్.
మీరో వస్తువుకొనాలనకుంటున్నారు. వెంటనే ఒక గంటలో కొనాలి. గంటలో ఇంట్లో ఉండాలి. మొదట అదెక్కడ దొరుకుతుందో మీకు తెలియాలి. అక్కడికి వెళ్లాలి. వెదకాలి. తెచ్చుకోవాలి. అంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో వెళ్లాలి. రావాలి. ఇది నరకం. ఇలా సగం రోజు పోవచ్చు లేదా దినమంతా పట్టవచ్చు. పోనీ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో బుక్ చేద్దామా అంటే మినిమం రెండు మూడు రోజులు పట్టవచ్చు. ఫలానా సూపర్ మార్కెట్ లో ఆన్ లైన్ లో వెదకాలంటే సాధ్యంకాదు. ఇలాంటి సమస్యలు చాలా వస్తుంటాయి.
ఒక గంటలో ఏదైనా కొనాలి అంటే ఒక్కొక్కసారి ఇంట్లోంచి బయటకు వెళ్లి కొని తెచ్చుకునేందుకు మూడ్ వుండదు. నా లైఫ్ లో చాలా సార్లు ఇలా జరిగింది. ఒక సారి బ్లూబెర్రీ జామ్ కావాలి. మా యింటిదగ్గర్లో ఎక్కడ దొరుకుతుందో తెలియదు. నాకు సమీపంలో ఉండే బిగ్ బజార్ కు వెళ్లాను. అక్కడ లేదు. అయితే, వెళ్లింది జామ్ కోసం… అక్కడేవేవో కనిపించాయి. అవికొనాల్సి వచ్చింది. వాటిని తీసుకుని ఇంటికి వచ్చే సగం సండే అయిపోయింది. నేను బయటకు వెళ్లిన మాట నిజం, సూపర్ మార్కెట్ కు వెళ్లింది నిజం. మూడుగంటలు వెచ్చించింది నిజం. ఇంత చేసినా నాకు కావలసి బ్లూ బెర్రీ (నేరెడు పళ్ల )జామ్ దొరకలేదు. విసుగొచ్చింది.
ఇలా ఫోన్ చేసి బ్లూబెర్రీ జాం పంపండంటే పంపే ఏర్పాటుంటే ఎంత బాగుంటుందనుకున్నాను.
సరిగ్గా ఈ సమస్యకు శుభాకర్ పరిష్కారం కొనుగొన్నాడు. ఆయన Mapprr ప్లాట్ ఫాం ను తయారు చేశాడు. హైదరాబాద్ లో పక్కా లోకల్ (హైపర్ లోకల్ )డెలివరీ ఏర్పాటు కల్పించాడు. మీకు కావలసి వస్తువు ఎక్కడ దొరుకుతుందో వెదుక్కోవచ్చు. బుక్ చేయవచ్చు. అరవై నిమిషాలలో మీ ఇంటి ముందుకు వస్తుంది. వస్తువు ధర 200 రుపాయల లోపు ఉంటే 25 రుపాయల చార్జ్ చేస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ఉచితంగా డెలివరీ ఉంటుంది.
ఒ…ఖ్కడే…
సాధారణంగా ఇన్నొవేటివ్ ఐడియాల వెనక ఇద్దరు ముగ్గురు పోరగాళ్లుం టారు. మ్యాపార్ మాత్రం శుభాకర్ ఒక్కడి ఆలోచనే. 2015లో బిటెక్ మెకానికల్ ఫైనల్ ఇయర్ (గీతాం) లో ఉన్నపుడు దీనికి అంకురార్పణ జరిగింది. అపుడాయన రోబొటిక్ ఆర్మ్ ప్రాజక్టు లో ఉన్నాడు. ఆయన కు కొన్ని వస్తువులు కావలసి వచ్చింది. వాటి కోసం కాళ్లరిగేలా చాలా రిటైల్ షాపులు తిరిగాడు. ఎక్కడా దొరకలేదు. అపుడు తలపట్టుకు కూర్చుని ఆలోచిస్తే తెలిసింది మార్కెట్ లో వినియోగదారకు రిటైలర్ కు మధ్య చాలా గ్యాంప్ ఉందని. దీన్ని అధిగమించాలనుకున్నారు. అంతే MAPPRR బీజం పడింది.
మీకు తెలిసిన సక్సెస్ స్టోరీలను మాతో షేర్ చేసుకోండి trendingtelugunews@gmail.com
2016 మార్చి లో దీని ప్లాట్ ఫాం తయారయింది. ఆలోచన వచ్చి అది కార్యరూపం దాల్చి వినియోగదారులకు సేవలిందించే స్థాయికి పరిపక్వం కావడానికి పట్టింది కేవలం ఆరు నెలలే.
MAPPRR మొదట వెబ్ సైట్ గా మొదలయింది. మొదట ఇది కేవలం వినియోగ దారుడికి అవసరమయిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయో చెప్పందుకు మాత్రమే ఉద్దేశించిన ప్లాట్ ఫాం. తర్వాత డెలివరీ సర్వీసుకూడా మొదలుపెట్టారు. 2018 జనవరి iOS, Androi App కూడా మొదలయింది. MAPRR ప్రత్యేకత లేమిటంటే… ఎంత ట్రాఫిక్ ఉన్నా 60 నిమిషాల్లో డెలివరీ అందిస్తారు. వస్తువులు నచ్చకపోతే అక్కడిక్కడే వాపసు ఇవ్వవచ్చు. ట్రాపిక్, పొల్యూషన్ వేసవిలో ఎండ వంటి సమస్యలను మర్చిపోయి హాయిగా మీక్కావలసిన సరకేదయినా సరే 60 నిమిషాలలో పొందవచ్చు. ఆర్డర్ చేసిన తర్వాత మీ ఆర్డర్ ఎలా వస్తున్నదో ఎపుడు గమనిస్తూ ఉండవచ్చు. శుభాకర్ తనకు ఆలోచన రాగానే పది మంది తన లాంటి చాకు లాంటి కుర్రవాళ్లను జత చేసుకుని కంపెనీ ప్రరాంభించాడు. శుభాకర్ వయసెంతో తెలుసా 28 సంవత్సరాలే.
ఇండియాలో ఈ తరహా ఇదే మొదటి యాప్. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సేవలందిస్తున్నారు. నిత్యావసర సరుకులు, మందులు,ఎలెక్ట్రానిక్ పరికరాలు, సౌందర్యసాధనాలు ఇలా దేన్నైనా 60 నిమిషాల్లో మీకందిస్తారు.