వరంగల్ అర్బన్ జిల్లా కు హన్మకొండ జిల్లా అని పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వరంగల్ జిల్లాలను 2016లో అయిదు జిల్లాలుగా విభజించారు. అవి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ్, మహబూబాబాద్,భూపాల్ పల్లి జిల్లాలు. ఈమధ్య అసెంబ్లీ ఎన్నికలయి పోయాక, ప్రజల డిమాండ్ మేరకు ఆరో జిల్లాగా ములుగు ప్రాంతాన్ని ప్రకటించారు.
అయితే, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల మీద ఇంకా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ను విభజించడం చాలా మందికి ఇష్టం లేదు.దీని వల్ల వరంగల్ జిల్లాకు ఉన్నా ప్రాముఖ్యం పోతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ వాదనను ఖాతరు చేయలేదు.
ఇపుడు వరంగల్ అర్బన్ జిల్లాను మహబూబాబాద్ జిల్లాగా ప్రకటించాని వారు డిమాండ్ చేస్తున్నారు. రూరల్ అర్బన్ జిల్లాలు కాకుండా మహబూబాబాద్, వరంగల్ జిల్లాలుగా కొనసాగించాలని, వరంగల్ రూరల్ ని వరంగల్ జిల్లాగా పిలవాలని వారు కోరుతున్నారు.హన్మకొండ జిల్లాగా పేరు మారిస్తే ప్రజలను సంతృప్తిపరచవచ్చని ప్రభుత్వం కూడా యోచిస్తూ ఉంది.
వరంగల్ లో ఆజాంజాహి మిల్స్ గ్రౌండ్స్ లో వరంగల్ జిల్లా ఇంటెగ్రేటెడ్ జిల్లాకలెక్టర్ల కార్యాలయం నిర్మించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది.