మాజీ రాష్ట్రపతులు దేశంలో రాజకీయాల మీద గాని, ప్రక్రియ మీద గాని మాట్లాడటం అరుదు. దానికి రాతపూర్వకంగా ప్రకటనలు చేయడం చాలా అరుదు. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక సంచలన ప్రకటన చేశారు. అది కూడా ఆయన ఎన్నికల కమిషన్ బాధ్యత మీద వ్యాఖ్యానించారు.
సరిగ్గా 24 గంటల కిందట ఎన్నికల కమిషన్ ఎన్నికలను బేషుగ్గా నిర్వహించిందని కితాబిచ్చిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఇవిఎం ల మీద జరగుతున్న వివాదంలో ప్రవేశించారు. ఇపుడాయ ప్రతిపక్ష పార్టీల నుంచి ఇవిఎంల మీద వస్తున్న అనుమానాలమీద తాను గొంతు కలిపారు. ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల జరిగే తీరు మీద, ఎన్నికల పరికరాల మీదఅనుమానం లేకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్ దే నని ఆయన పేర్కొన్నారు.
ఇవిఎం ల టాంపరింగ్ జరుగుతున్నదనే ఫిర్యాదు మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిఎం లన్నీ ఎన్నికల కమిషన్ అదీనంలోనే ఉన్నందున వాటి భద్రత కూడా ఎన్నికల కమిషన్ దే నని ఆయన పేర్కన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలా ఒక మాజీ రాష్ట్రపతి ఎన్నికల మీద ఒక ప్రకటన విడుదల చేయడం ఇదే మొదటిసారి.
ఇందులో ఓటింగ్ అనేది మన ప్రజాస్వామ్యానికి పునాది అయినందున ఇందులో వూహాగానాలకు తావుండటానికి వీల్లేదు. ప్రజల తీర్పుఅనేది పవిత్రమయినది.దీనినిమీద ఇసుమంతయినా అనుమానం ఉండకూడదు.
‘పని చేసే వాళ్లే సంస్థాగత పరికరాలు ఎలా పనిచేయాలో నిర్ణయించాలనేది నా గట్టి విశ్వాసం. నాకు ప్రజాస్వామిక సంస్థల మీద ప్రగాఢమయిన విశ్వాసం ఉంది. అందువల్ల సంస్థ అనేది సమగ్రంగా పని చేసేలా చేసే బాధ్యత ఎన్నికల కమిషన్ దే. ఎన్నికల కమిషన్ అలా పనిచేయాలి. అన్ని అనుమానాలను నివృత్తి చేయాలి,’ అని మాజీ రాష్ట్రపతి ప్రకటనలో పేర్కొన్నారు.