*రామగుండము పోలీస్ కమీషనరేట్*
*పత్రికా ప్రకటన*
*సామాన్యులను అధిక వడ్డీలతో పీడిస్తున్న అనుమతిలేని అక్రమ ఫైనాన్స్ పై రామగుండము పోలీస్ ఉక్కుపాదం*……..
*అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న 49 మంది అరెస్ట్ వారి వద్ద నుండి సుమారు: 65.52 లక్షల రూపాయలు, ప్రాంసరినోట్స్-1235, బ్లాంక్ చెక్ లు -1019, ATM కార్డ్స్-347, బాండ్ పేపర్స్-175, ల్యాండ్ పేపర్స్-23, పట్టా పాస్ బుక్స్-9లు స్వాధీనం*
*పరారీలో మరో 70 మంది అక్రమ ఫైనాన్స్ నిర్వహకులు* …….
*గిరిగిరి (డైలీ ఫైనాన్సు) దందాపై పూర్తి స్థాయిలో నిఘా త్వరలో మరిన్ని అరెస్ట్ లు* ……
రామగుండము కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాల లో అక్రమ ఫైనాన్సు,వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిపై నిఘా పెట్టి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తరువాత కమీషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్,స్పెషల్ బ్రాంచ్ ,సిసిఎస్,స్థానిక పోలీస్ లతో (60) టీమ్స్ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలలో అధిక వడ్డిలు వసూలు చేస్తున్న వ్యక్తుల ఆఫీసులపై ,ఇండ్లపై దాడులు నిర్వహించి ఫైనాన్సు పేరుతో ,గిరిగిరి పేరుతో ప్రజల దగ్గర నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న సుమారు 60 ఫైనాన్సు ఆఫీసులపై ,ఇండ్లపై దాడులు నిర్వహించి , వారివద్ద నుండి బ్యాంకు అకౌంట్ బుక్ లు ,పాస్ బుక్స్ ,ఏటీఎం కార్డు, బ్యాంకు చెక్ లు ,ప్రాంసరి నోట్ ,ఇతర రికార్డ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది .
*నిందితుల వివరములు* :
*మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో* …..
1. పవన్ కుమార్ తివారీ s/o మంగిలాల్ జీ,మంచిర్యాల్ (శ్రీ లక్ష్మి హైర్ పర్చేజ్ & కమర్షియల్ ఫైనాన్సు)
2. సందిరెడ్డి శ్రీనివాస్ s/o వెంకటప్పయ్య ,మంచిర్యాల్ ,(పద్మ ప్రియ ఫైనాన్సు)
3. గుమ్మడి మస్తాన్ యాదవ్ s/o వెంకటేశ్వర్లు యాదవ్ ,మంచిర్యాల్ ( శ్రీ వెంకటేశ్వరా ఫైనాన్సు)
4. వెంపటి సత్యనారాయణ s/o నరసింహ స్వామి (నవరత్న HP ఫైనాన్సు)
5. పడాల అశోక్ బాబు s/o కుమారస్వామి ,కృష్ణ నగర్ ఎన్టిపిసి ,(రామాంజనేయ HP ఫైనాన్సు)
6. సుజిత్ కుమార్ s/o సుబాష్ ,మంచిర్యాల ,(శ్రీసాయి ఫైనాన్సు)
7. అందరి రమేష్ s/o ఐలయ్య ,మంచిర్యాల్ (లక్ష్మి గణపతి ఫైనాన్సు)
8. నేరెల్లి సాయి కృష్ణ s/o ….,మంచిర్యాల్ ,(శ్రీ సింగరేణి చిట్స్ ప్రైవేటులిమిటెడ్)
9. రావికంటి సతీష్ s/o వెంకటేశ్వర్లు,మంచిర్యాల్ (శ్రీ లక్ష్మి HP ఫైనాన్సు)
10. బట్టు రవి కుమార్ s/o మల్లయ్య ,మంచిర్యాల్ (వైష్ణవి HP ఫైనాన్సు)
11. ఎగ్గు శ్రీనివాస్ s/o శ్రీనివాస్ ,సిసిసి నస్పూర్ (స్నేహాంజలి HP ఫైనాన్సు)
12. ముదం రమేష్ s/o మల్లయ్య ,మందమర్రి (విజయ శ్రీ ఫైనాన్సు)
13.
*సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో* …..
14. గజ్జేల్లి గణేష్ s/o కొండయ్య ,సిసిసి నస్పూర్ (అమ్మ హైర్ పర్చేజ్& ఫైనాన్సు)
15.
*బెల్లంపల్లి II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో*……
16. కుదిరపాక సత్యనారాయణ s/o వీరస్వామి ,బెల్లంపల్లి (శ్రీ వైష్ణవి హైర్ పర్చేజ్& ఫైనాన్సు)
17. నగరపు రామయ్య s/o తిరుపయ్య ,బెల్లంపల్లి
18. చింతనిప్పుల రమేష్ s/o రాయమల్లు ,బెల్లంపల్లి (లక్ష్మి వెంకటేశ్వరా హైర్ పర్చేజ్& ఫైనాన్సు)
19.
*తాండూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో* ……
20. మద్దికుంట రామచందర్ s/o మొగిలయ్య ,ఐబి తాండూర్,(శ్రీ లక్ష్మి గణపతి హైర్ పర్చేజ్& ఫైనాన్సు)
21.
*మందమర్రి పోలీస్ స్టేషన్ పరిదిలో*……
22. ఆది దేవేందర్ s/o చంద్రయ్య ,మందమర్రి (మారుతీ ఫైనాన్సు)
23. బత్తుల శంకర్ s/o వెంకటేశం,మందమర్రి,(శ్రీ మెడికల్ షాప్ )
24.
*బెల్లంపల్లి ఐ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో*……
20.పోతురాజు మంగమూర్తి బెల్లంపల్లి (వేద హైర్ పర్చేజ్& ఫైనాన్సు)
*చెన్నూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో*….
21 .బండారి సంతోష్ ,22.కోమటిపల్లి రమేష్ ,23.గాదె రాజన్న ,24.పోగుల చంద్రశేకర్ 25.పోగుల్ ఆనంద్ 26.కుందారపు రవీందర్ 27. చెన్నం సంతోష్ 28.మాసినేని లక్ష్మన్ 29.పోగులు సంతోష్ ,30. చింతల సుదర్శన్(శ్రీలక్ష్మి హైర్ పర్చేజ్& ఫైనాన్సు)
*పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో*….
౩1.మడికొండ సదాశివ s/o సాంబయ్య పెద్దపల్లి
32.కోలేటి ప్రసాద్ s/o నాగలింగం ,పెద్దపల్లి
*గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో* ….
33.పర్స ,వెంకటేశ్వర్లు s/o లింగయ్య గోదావరిఖని
34.వేముల శ్రీనివాస్ s/o నర్సయ్య గోదావరిఖని
35.పొన్నం విజయ్ కుమార్ గౌడ్ s/o ఎల్ల గౌడ్
36.మహంకాళి స్వామి s/o దుర్గయ్య గోదావరిఖని
౩7 .పొన్నం లక్ష్మయ్య గౌడ్ s/o మల్లయ్య గోదావరిఖని
38.కాసాని శ్రీనివాస్ s/o నర్సయ్య గోదావరిఖని
39.అడవెల్లి రవీందర్ రెడ్డి s/o సాయి రెడ్డి గోదావరిఖని
40.అవనిగంటి ఎల్లేష్ s/o యాదగిరి గోదావరిఖని
41.కోరం రవీందర్ రెడ్డి s/o నరసింహ రెడ్డి గోదావరిఖని
42.అనుమ సత్యనారాయణ s/o లక్ష్మయ్య గోదావరిఖని
43.గుర్రం శ్రీనివాస్ s/o వీరయ్య గోదావరిఖని
44.మంత్రి శ్యాం సుందర్ s/o బాబులాల్ గోదావరిఖని
*ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో*….
45.బేతి రామచంద్ర రెడ్డి s/o నారాయణ రెడ్డి, గౌతం నగర్ ఎన్టిపిసి
46.బిడిదా మహేందర్ s/o లక్ష్మయ్య,సిసిసి నస్పూర్
*గోదావరిఖని II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో*…
47.పంజాల సదానందం s/o వీరయ్య ,8 ఇంక్లైన్ కాలనీ
48.పోలవేణి రమేష్ s/o కోమురయ్య 8 ఇంక్లైన్ కాలనీ
49.అనంతుల రాజు s/o జగదీశ్వర్ , 8 ఇంక్లైన్ కాలనీ
*పరారిలో ఇంకా (70 ) మంది అక్రమ ఫైనాన్సు నిర్వాహకులు* .
*స్వాధీన పరుచుకున్న వాటి వివరములు* :
*స్వాధీనపరుచుకున్న నగదు సుమారు : 65.52 లక్షల రూపాయలు*
Signed empty Promissory Notes-(1235), Signed Blank Cheques-(1019), ATM Cards-(347), Signed Blank Bond Papers-(175), Signed empty agreements-(29), Land Documents-(23), Account Pass Books-(47), Signed agreement white papers affixed with revenue stamps-(68), Blank Signed Surety Papers-(9), Pattadar Pass Books-(9), Sahara Fixed Deposit Bonds-(3) , Loan Files-(100), Daily Collection Books-(14), Dairies-(02), Ledger Books-(11), Cash Book-(1), Vehicle Documents-(14), Receipt Books-(9), MI Cell Phone-(1), Token Books-(30), Packet Books-(35)
*ఇంకా విచారణ జరుగుతుంది & సాక్ష్యాల సేకరణ*…..
అక్రమ ఫైనాన్స్ లపై ఇంకా పూర్తిస్థాయి విచారాణ కొనసాగుతుంది.ఎవరు ఎవరున్నారు ,ఎంత మొత్తంలో డబ్బులు పెట్టారు ,ఎవరిఎవరితో సంబందాలు ఉన్నాయి.వీరికి డబ్బు ఎలా వస్తుంది అని పలు సాక్ష్యాల సేకరణ చేయడం జరుగుతుంది.పూర్తి విచారణ తరువాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది .
*విచారణ కొనసాగుతున్న ఫైనాన్స్ ల జాబితా*
1. కనకదుర్గ ఫైనాన్స్ మంచిర్యాల
2. వేదశ్రీ HP ఫైనాన్స్ లక్ష్టేటిపేట్
3. వెంకటేశ్వరా ఫైనాన్స్ లక్ష్టేటిపేట్
4. లలిత ఆదిత్య చిట్ ఫండ్ మందమర్రి
5. నిత్య శ్రీ హై పర్చేజ్ & ఫైనాన్స్
6. నాగలక్ష్మి HP ఫైనాన్స్ మందమర్రి
7. భవిత శ్రీ చిట్ ఫండ్ ఎన్టిపిసి
8. కర్రే శ్రీనివాస్ ఫైనాన్స్ గోదావరిఖని
9. ముడతలపల్లి ప్రవీణ్ కుమార్ గోదావరిఖని
10. రాదే శ్యాం లోయ గోదావరిఖని
11. గౌడిశెట్టి రంగయ్య గోదావరిఖని
ఇవే కాకుండా రామగుండము కమీషనరేట్ పరిధి లోని మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలలో ఇంకా సుమారు 150 వరకు అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించడం జరిగింది .వీటికి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించి వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడును
*సామాన్యుల అవసరమే వారికీ ఆసరా….ఎదుటివారి ఆపదేవారికీ సంపద*…….
రామగుండము కమీషనరేట్ పరిధి లో కొంతమంది వ్యక్తులు ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకోని ప్రైవేటు ఫైనాన్సులు రోజు వారిగా వడ్డీ వ్యాపారం (గిరిగిరి మిత్తి ), హైర్ పర్చేజ్ సంస్థల నుండి వడ్డీ దందా సాగిస్తున్నారు.ఆర్దిక సహాయం పేరుతో మొదలయ్యే వడ్డీ , హైర్ పర్చేజ్ వ్యాపారం అక్రమాలకు నిలయం .కొంతమంది ప్రైవేటు ఫైనాన్సులు ఎలాంటి అనుమతులు లేకుండ ఏర్పాటుచేసి డబ్బులు అప్పుగా ఇవ్వడం తరువాత వారిని పీడించడం జరుగుతుంది.ప్రజల అత్యవసర పరిస్థితులను ఆసరాగా తీసుకోని రూ.100 కు 5రూ నుండి రూ .10 చొప్పున వడ్డీలు వసూలు చేయడం జరుగుతుంది.వీరికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు .
*అవసరాలకు ఆర్దిక సహాయం పేరుతో* ……..
ఫైనాన్సుకంపెనీలు , హైర్ పర్చేజ్ వ్యాపారం నిర్వాహకులు ప్రజల అత్యవసర పరిస్థితితులను ఆసరాగా తీసుకోని ఆర్దిక సహాయం అందచేసి వారి అవసరానికి సహాయం చేసి మంచివారుగా ప్రవర్తించి అప్పుడు ఉన్న వారి పరిస్థితిని ఆసరాగా చేసుకొని వాహనాల కొనగోలుకు , వ్యక్తిగత అవసరాలకోసం అప్పుతీసుకొనే సమయంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయిoచు కుంటున్నారు ,పత్రలలో పూర్తి వివరములు రాయకుండానే సంతకాలు తీసుకుంటు అప్పులు ఇవ్వడం జరుగుతుందని ఇంకా బ్యాంకు అకౌంట్ బుక్ ,ఏటీఎం కార్డు,చెక్ బుక్ స్వాదీనం చేసుకొని ,ప్రాంసరి నోట్ రాపించుకుంటున్నారు .రూ.100 కు 5 నుండి రూ .10 చొప్పున అధిక వడ్డీలు వసూలు చేయడం జరుగుతుంది.పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతే భూముల పేపర్లు ,ఇంటి పత్రాలు తీసుకోని డబ్బులు ఇస్తున్నారు .అవసరాలకోసం ప్రజలు తప్పక డబ్బులు తీసుకోని అధిక మొత్తంలో వడ్డీలు, ఇక గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండిన తర్వాత చెల్లించినా ఫర్వాలేదంటున్నారు. అయితే రైతులు పంట దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర రాకపోవడంతో తీసుకున్న అప్పు తీర్చలేక.. ఆత్మహత్య చేసుకుంటున్నారు .
*గంటల్లో మార్ట్ గేజ్ లోన్లు ఇవ్వడం* ….
బ్యాంక్ లు అప్పులు ఇవ్వాలంటే అన్ని రకాల పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అని సరిచూసి ,ఇద్దరు లేక ముగ్గురు జమానత్ గా పెట్టుకొని ఇల్లు లేదా భూమి ,బంగారం ఆభరణాలు మార్ట్ గేజ్ చేసుకొని అప్పులు ఇస్తుంటారు.దానికి చాలా రోజుల నుండి నెలల టైం పట్టవచ్చు లేదా లోన్ నిరాకరించవచ్చు. కానీ ప్రైవేటు ఫైనాన్సు లు ఏలాంటి నిబంధనలు లేకుండా ఆస్తులను తనాఖా పెట్టుకొని అధిక వడ్డిలకు అప్పులు ఇస్తూ ,సకాలంలో అప్పులు చెల్లించ కుంటే భూములు ,ఇళ్ళను స్వాదీనం చేసుకుంటున్నారు.అప్పు కట్టడం వీలు గాని పక్షంలో వారిపై దాడులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు
*చట్ట పరమైన ఎలాంటి అనుమతులు లేకుండా*…..
రామగుండము కమీషనరేట్ పరిధిలో అనుమతులు లేకుండా గిరిగిరి ఫైనాన్స్,ఆటోఫైనాన్సు (నెలవారీ)లు ఉన్నాయి చాలా మంది ఉదయం తీసుకోని సాయంత్రం చెల్లించేందుకు 10 శాతం నుండి 20 శాతం వడ్డీ చొప్పున వడ్డి వసూలు చేస్తున్నారు.
*గిరిగిరి పేరుతో డైలీ ఫైనాన్సు*
జీరో దందా చేసే కమిషన్ ఏజెంట్లకు ,చిరు వ్యాపారులకు,ఆటో డ్రైవర్స్ ,చిన్న చిన్న షాప్ ల వారికీ , పండ్ల వ్యాపారం చేసేవారికి ఉదయం రూ .800 ఇచ్చి సాయంత్రం రూ .1000 వసూలు చేయడం.వారి వద్ద నుండి అధిక వడ్డిలను వసూల్ చేయడం జరుగుతుంది . ఎలాంటి కాగిత పూర్వకంగా కాకా, నోటిమాటలతో,పద్దులతో నడుస్తుంది కావున ఆదాయపన్ను సహా ఇతర పన్నులు కట్టడం లేదు.ఇలాంటి దందా నిర్వహించే వారి జాబితా సిద్దం చేయడం జరుగుతుంది అతి త్వరలో వీరిపై దాడులు నిర్వహించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు .
*వాహనాలు ,బంగారు ఆభరణాలు తనఖా పేరుతో అక్రమ వ్యాపారం* :
మంచిర్యాల ,గోదావరిఖని ,బెల్లంపల్లి,పెద్దపల్లి పట్టణాలలో కొంతమంది వ్యక్తులు వాహనాలు,బంగారు ఆభరణాలు తనఖా పెట్టుకొని వారి అవసరాలకు డబ్బులు ఇస్తూ వారి వద్ద నుండి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు వారు ఆత్మహత్యలు చేసుకునేల చేస్తూ వారి కుటుంబాలు రోడ్ నా పడేలా చేస్తున్నారు .
*రికవరీ గుండాల రుస్తుం గిరి చెల్లదు* …
అప్పుల రికవరీ కోసం ప్రైవేటు ఫైనాన్సు యజమానులు రికవరీ సిబ్బందిని ఏర్పరుచుకొని కమిషన్ పై పాత బాకీలు వసూలు చేయడం ,ఒక వేళ వారు కట్టని ఎడల వారిని బెదిరించడం తిట్టడం అందరి ముందు అవమాన పరచడం ,పరువు తీయడం ,స్త్రీలను అగౌరవ పరచడం ,అవసరమైతే కిడ్నాప్ లకు పాల్పడడం,దాడులకు పాల్పడి వారిని మానసిక ,శారీరక హింసలకు గురి చేయడం జరుగుతుందని మా విచారణలో తేలింది.అలా ప్రజలను అవమానానికి గురిచేసి,కృంగుబాటుకు గురిచేస్తున్న రికవరీ గుండాలకు కళ్ళెంవేస్తాం.వారిని కటకటాల వెనక్కు పంపించండంతోపాటు పిడి యాక్ట్ ప్రయోగిస్తాం
*ప్రముఖుల హస్తం పై ఆరా*……
అక్రమ ఫైనాన్సు దందాపై ఇంకా లోతుగా ఆరా తీయడం జరుగుతుందని ,అక్రమ వ్యాపారంలో ప్రముఖుల హస్తం ఉందని మా విచారణలో తేలిందని ఇంకా పూర్తిస్థాయిలో విచారణ జరిపి వివరములు త్వరలోనే వెల్లడిస్తాం అని సిపి గారు అన్నారు .
*ఫైనాన్స్ నిర్వహించాలంటే ఈ క్రింది నిబంధనలు తప్పక పాటించాలి* ……
• ఫైనాన్స్ పేరుతో రిజిస్ట్రేషన్ నమోదై ఉండాలి.
• ఫైనాన్స్ పేరిట ట్యాన్, పాన్ కార్డు తప్పనిసరి
*మని లెండింగ్ లైసెన్ తప్పని సరి తీసుకోవాలి
• బ్యాంకు ఖాతా ద్వారానే లావాదేవీలు నడపాలి ఆదాయ పన్ను రికార్డులు ఏటా ఫైనాన్స్ ఆడిటింగ్ చేయించి సంబంధిత అధికారులకుఅందజేయాలి.
• ఫైనాన్స్ కార్యాలయానికి లీజ్ డీడ్ తప్పనిసరీగా యజమాని చేయించుకోవాలి.
*మోసపోవద్దు*…..
ప్రజలు తమకు ఉన్న అత్యవసర పరిస్థితి , తాత్కాలిక ఇబ్బందులకోసం అధిక మొత్తంలో అవసరంకి మించి అధిక వడ్డిలకు అప్పులు చేసి తరువాత ఆ అప్పులు ,అధిక వడ్డీలు చెల్లించ లేక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను రోడ్ పాల్చేస్తూ వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు.ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన సరైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు పోలీస్ వారికీ తెలియచేయాలి .ఎంత వడ్డీ అయిన కట్టేస్తాంలే అని తీసుకోని వడ్డీ బారెడు అయి ఆర్దికంగా విచ్చిన్నం అవుతున్నారు .
*అప్పు తీసుకోవడం ,ఇవ్వడం నేరం కాదు* :
RBI నియమనిబందనలు,తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్తో అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు.కాని చట్ట విరుద్ధంగా,దోపిడీ వడ్డీ రేట్లతో సామాన్యుల నడ్డివిరిచి వారిపై దౌర్జన్యం లను చేసే వారె మా టార్గెట్ .ఆస్తులు కబ్జా చేసి,కాజేసి ,స్త్రీలు,పెద్దవారిని అవమానిస్తే వారు కఠినం గా చట్టపరంగా శిక్షించబడతారు .న్యాయ బద్ధంగా,చట్ట బద్ధంగాజరిగే అప్పుల వ్యవహారాల జోలికి మేం వెళ్ళo ,వాటి పరిష్కరంకు న్యాయస్థానాలను ఆశ్రయిoచాలి
*దోపిడీకి చిన్న పెద్ద తేడా లేదు* …
అక్రమ ఫైనాన్స్ ల ద్వార జరిగే దందాలలో దోపిడీ ప్రభావం విషయంలో చిన్నా ,పెద్దా వుండదు .ధనికుడికి 50 లక్షల దోపిడీ జరిగినా, పేదవాడికి 50 వేలు జరిగినా ఆ ఇంటెన్సిటీ ఒక్కటే.కూలీ చేసుకొనే వారిని 5 వేల అక్రమ దోపిడీ చేసిన వారికీ అపార నష్టం జరుగుతుంది.
*కమీషనరేట్ పరిధిలో మరిన్ని దాడులు*….
నకిలీ పత్తి విత్తనాలు , కలప అక్రమ రవాణా, చిట్ ఫండ్, ఫైనాన్స్, పలు వ్యభిచార గృహాలపైనా అలాగే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాలలో నిషేదిత గుట్కా,ఇసుక అక్రమ రవాణా ,కల్తీ ఆహర పదార్థాలు,భూ మాఫియా ,రౌడియిజం,ఇంకా మరిన్ని అక్రమ వ్యాపారా దందాలపై ఉక్కుపాదం మోపుతాం అన్నారు.జాబితా సిద్దం చేస్తున్నాం ,ఏ తరహా అక్రమాలకుపాల్పడ్డా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.కమీషనరేట్ పరిదిలో ప్రజలకు పోలీసు ల మైన మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము అని సాదారణ జీవితం గడిపే వారికీ మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ నేరాలకు పాల్పడే వారికీ ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికీ కాదు అని అన్నారు .ప్రజా శాంతికి భంగం కలిగిస్తూ వారి స్వేచ్ఛా భంగం కలిగేంచే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రజల భద్రతే తెలంగాణా పోలీసు లక్ష్యం అందరూ సురక్షితంగా ఉండాలి.
కమీషనర్ ఆఫ్ పోలీస్,
రామగుండం