తప్పా వొప్పా అనే విషయాన్ని పక్కన బెడితే, నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి బాగా నిరాశ కల్గించాయనక తప్పదు.
బిజెపికి, ఎన్ డిఎ కి కూడా మెజారిటీ రాదని, అపుడు చక్రం తిప్పేది తామేనని ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు తెగ ఆశపడ్డారు.
చిటికేస్తే చాలు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిపోయి జాతీయ నాయకులను, ప్రాంతీయ పార్టీనేతలను కలసి హడావిడి చేస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి తీరే వేరు. ఆయన పుణ్యక్షేత్రాలు రాజకీయాలు కలిసి పుణ్యం పురుషార్థం రెండు వెద్దుక్కుంటున్నారు.
తనకు 16సీట్లొస్తాయని , దానికి ఆంధ్ర నుంచి జగన్ కు వచ్చే 22 లేదా 23 సీట్లు కలిపితే 38 సీట్లవుతాయని (జగన్ కలుస్తాడని అంత విశ్వాసమేమిటో?) అపుడు ఢిల్లీలో జాయింట్ బార్గెయిన్ చేయవచ్చని ఆశపడ్డారు .
ఈ క్రమంలో ఫెడరల్ ఫ్రంటు అని కూడా మరికొంతమందిని కలుపుకునే ప్రయత్నం చేశారు. అది నెర వేర లేదు. అది నెరవేరి ఉంటే తన బలగం 50 లేదా 60 లేదా 100 కూడా కావచ్చు.అపుడు ప్రధాని పదవి కూడా డిమాండ్ చేయవచ్చని ఆశపడ్డారు.
అయితే, తెలుగు ముఖ్యమంత్రులకు శ్రమ లేకుండా చేస్తున్నది ఎన్డీయే. ఎన్డీయే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చని ఎగ్జిగ్ పోల్స్ చెబుతున్నాయి. ఇదొక పెద్ద ఎదురు దెబ్బ వారిద్దరికి.
అయితే, కెసిఆర్ మాత్రం తెలంగాణలో సుప్రీం గా బయటపడతారని పోల్స్ చెబుతున్నాయి. అపుడాయన కింగ్ , కింగ్ మేకర్ అనే విషయాలు పక్కన బెట్టి ఎన్డీయే ప్రభుత్వంలో చేరవచ్చు. ఈ మేరకు 17 వ తేదీన ఢిల్ల్లీలో ప్రధాన మత్రి మోదీతో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కొత్త పార్టీలు ఎన్డీయోలోకి రావచ్చని ఆహ్వానం పంపారు.
కాబట్టి కెసిఆర్ ఎన్డీయేలో చేరవచ్చు. ఒకరిద్దరు లేదా ముగ్గురిని మంత్రులను చేయవచ్చు.లేదంటే ఎంఐఎం తో ఉన్నావని చెప్పి బిజెపి ఆయన్ని దూరంగా పెట్టవచ్చు. ఎందుకంటే, అపుడు కెసిఆర్ అవసరం అంతవుండదు. కెసియార్ కు 12 నుంచి 15 సీట్లొచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నా ఎన్డీయే కి ఇవి బరువవుతాయి తప్ప బలాన్నివ్వవు.
అయితే, ముఖ్యమంత్రులిద్దరు బిజెపి దారుణంగా దెబ్బతింటుందని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి తో పాటు, ఆయన కుమారుడు కెటిఆర్ కూడా బిజెపి కి సొంతంగా సీట్లు తగ్గుతాయని, ఏన్డీయేకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని చెప్పేవారు. అపుడు కెసియారే ముందుంటారని కెటిఆర్ చాలా సార్లు అన్నారు.
కెసిఆర్ మాత్రం బిజెపికి160 సీట్లకు మించి రావని అన్నారు. అపుడు బిజెపియేతర, కాంగ్రెసేతర పార్టీలను జతకలిపి ఫెడరల్ ఫ్రంటు ఏర్పాటు చేయవచ్చని ఆయన భావిస్తూ వచ్చారు.
అయితే, ఇది కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే . అసలు ఫలితాలు ఎలా ఉంటాయో. కాబట్టి అప్పటి దాకా తెలుగు ముఖ్యమంత్రులు పథకాలు వేస్తూనే ఉండవచ్చు
Five years is not a long period to bring reforms pandit Jawaharlal Nehru who is the architect of our nation introduced five years plans on the country similarly mr Modi should also get some years to bring reforms in the country I beleive