ప్రముఖ శైవ క్షేత్రం అయిన కొమురవెల్లి మల్లన్న ఆలయం హుండీ లెక్కింపు లో స్వర్ణకారుల చేతివాటం ప్రదర్శించి పోలీసు తనిఖీలో అడ్డంగా బుక్ అయ్యారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం లోని కొమురవెల్లి మల్లన్న దేవస్థానంకి ఆలయ సందర్శనార్థం వచ్చిన భక్తులు కానుకలను సమర్పిస్తుంటారు.
సత్యసాయి సేవా సమితి సభ్యులు మరియు ఆలయ ఉద్యోగులు లెక్కిస్తుంటారు. ఈ కానుకలలో బంగారు వెండి ఆభరణాలను స్వర్ణ కారులచే నిర్దారణ చేయిస్తారు.
అయితే గురువారం రోజున ఆలయ హుండీ లెక్కిస్తున్న క్రమం లో శ్రీనివాస్ ,కిషన్ అనే ఇద్దరు స్వర్ణ కారులను నాణ్యత పరిశీలన కి పిలిపించారు. పరిశీలిస్తున్న క్రమం లో రెండు తులాల బంగారు ఆభరణాన్ని వారి బ్యాగ్ లో వేసుకున్నారు. మరో తులం ఆభరణాన్ని అంగి జేబులో వేసుకొన్నారు.
హుండీ లెక్కింపు అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయాక వెళ్దాం అనుకునే సమయం లో ఓ కానిస్టేబుల్ కి అనుమానం వచ్చి వ్యక్తిగతంగా తనిఖీ చేయగా ఆభరణాలు భయటపడ్డాయి.
వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలని ఆలయ ఈ ఓ కి అప్పగించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.