Skip to contentచిలకలూరిపేట టిడిపి నాయకురాలు, ఆంధ్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు.
మంగళగిరి ఖాజా తొల్గేట్ దగ్గర ఆమె హల్చల్ చేశారు.
టోల్ గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ ఫీజు ఇవ్వకుండా వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారు.
ఆమెను టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. టోల్ కట్టే వరకు వదల్లేదు.
ఎమ్మెల్యే స్టిక్కర్ చూసి పోనియాలి అని కోరినా వదల్లేదు. ప్రజాప్రతినిదికి మాత్రమే ఛాన్స్ తప్ప మీకు లేదు అని నిరాకరించారు.
మంత్రి భార్య వెంకటకుమారి టోల్ సిబ్బంది మీద చిందులు వేశారు. అయినా వాళ్ళు లెక్క చేయకపోవడంతో టోల్ చెల్లించి అక్కడి నుండి వెళ్లిపోయారు మంత్రి సతీమణి.
వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కింద వీడియో ఉంది చూడొచ్చు.