రాజంపేట మాజీ సాయిప్రతాప్ తిరిగి కాంగ్రెస్ లోకి వస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ మారి తప్పుచేశానన్నారు. నిన్న కాంగ్రెస్ కండువా మళ్లీ కప్పుకుంటూ కాంగ్రెస్ వీడి తప్పు చేశానని కన్నీళ్ల మధ్య ప్రకటించారు.
తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందని చెబుతూ ఇక జీవితంలో పార్టీ పార్టీ వీడనని చెప్పారు. చనిపోతే కాంగ్రెస్ కండువా వేయాలని సూచించారు.
తనను ఆదరించిన రాజంపేట పార్లమెంటు స్థానానికి పూర్వ వైభవం తెస్తానని ప్రకటన చేశారు. అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఆయన 2016 మార్చి 24న కాంగ్రెస్ వదిల టిడిపి చేరారు.
సాయిప్రతాప్ చాలా సీనియర్ నాయకుడు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎంపిగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుయాయుడుగా పేరుంది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో ఆయన రాజకీయంగా కొద్ది రోజులు కనుమరుగయ్యారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్కు భవిష్యత్తు లేదనుకున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడేమీ ఆయన అనందంగా లేరు. పార్టీలో ఉన్నా ఆయన్నెవరూ పట్టించుకోలేదు.దీనితో సొంతపార్టీకి వెళితే కనీసం మిత్రులయిన ఉంటారు, పరువుంటుంది,పార్టీ బలపడితే భవిష్యత్తూ ఉంటుందనుకున్నారు. గురువారం నాడు మళ్లీ పార్టీలో చేరారు.
తెలుగు కుర్రవాడి కోసం అమెరికా ప్రభుత్వం మీద కేసు
నిన్న కడపలో జరిగిన ఒక కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాయిప్రతాప్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్నపుడు యుపిఎ 2 లో ఆయన ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.