ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడానికి ఆ జట్టు సహా అధ్యక్షురాలు నీతా అంబానీ చేసిన ప్రత్యేక పూజలే కారణమా అనే ప్రశ్నకు ఆయా వర్గాల నుండి అవుననే సమాధానమే వినిపిస్తుంది.
రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ వైష్ణో దేవి భక్తురాలు. చిన్నతనం నుండే ఆధ్యాత్మిక భావాలు కలిగిన నీతా ప్రతి రోజు లలిత సహస్ర పారాయణం చేస్తుంది.
క్రికెట్ పై మక్కువ ఉన్న నీతా ముంబై జట్టు కి ముకేశ్ అంబానీ తో పాటు నీతా అంబానీ కూడా ఓనర్ గా ఉన్నారు.
2013 లో ఉప్పల్ స్టేడియం లో జరిగిన ఐపీయల్ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ కి వచ్చారు..అంతకు ముందు ఇంటర్నెట్ లో స్వయంభువులుగా వెలిసిన అమ్మవార్ల దేవస్థానాల గురించి సెర్చ్ చేశారు.
బల్కంపేట్ లో వెలసిన ఎల్లమ్మ దేవత గురి౦చి తెలుసుకున్నారు. చారిత్రిక ఆధారాలా ప్రకారం 700 సంవత్సరాల పూర్వమే ఈ ఆలయం ఉన్నట్టు అప్పట్లో బావి లో ఉన్న అమ్మవారు నీటి మధ్యలో లో శిలా రూపం లో ఉందని తెలుసుకొని ఈ ఆలయాన్ని సందర్శించాలని భావించారు.
అమ్మవారిని దర్శించుకున్న ఆనంతరం నేరుగా స్టేడియం కి చేరుకొని మ్యాచ్ ని చూసారు. ఆ మ్యాచ్ లో ముంబై జట్టు విజయం సాధించడం తో ఫైనల్ లో కూడా గెలిచింది.
అప్పటి నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రతి సారి నీతా అంబానీ బాల్కంపేట్ అమ్మవారిని దర్శిచుకు౦టున్నారు.
అయితే గత ఆదివారం సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన నీతా అంబానీ నేరుగా స్టేడియం కి వెళ్లి మ్యాచ్ ని తిలకించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై బ్యాటింగ్ ముగుసిన అనంతరం విరామ సమయం లో 9 గంటలకు బల్కంపేట్ లోని ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి ముంబై జట్టు విజయం సాదించడానికి పూజలు నిర్వహించాలని ఆలయ ఈ ఓ ని కోరగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆన౦తరం తిరిగి స్టేడియం కి వచ్చి మ్యాచ్ ని తిలకించారు. తర్వాత తీవ్ర ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ జట్టు అనూహ్య విజయ౦ సాధి0చింది.
దీంతో నీతా అంబానీ సెంటిమెంట్ మొక్కు వల్ల ముంబై విజయం సాధించిందని అందరు అనుకుంటున్నారు. వీడియోలు పైన ఉన్నాయి చూడొచ్చు.