జగ్గారెడ్డి చిట్ చాట్. గాంధీ భవన్ లో చిట్ చాట్ చేశారు. ఆ వివరాలు కింద చదవండి.
సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో మంచి పాత్ర పోషించిచింది. మిగతా జిల్లాలో కూడా జడ్పి చైర్మన్ లు వస్తాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన 40 రోజుల తరువాత ఎంపీపీ, జడ్పి చైర్మన్ లను ప్రకటించడం దారుణం.
తప్పు ఎవరైనా చేస్తారు వాటిని దృష్టి లో పెట్టుకుని తెరాస నాయకులు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.
మమ్ములను పోలీస్ లతో బయపెట్టాలని చూస్తే భవిష్యత్ లో మేము అధికారం వస్తే ఇవ్వే రిపీట్ అవుతాయి.
అధికారం ఎవరి సొత్తు కాదు. కొందరు పోలీస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు.
వైస్సార్ లాంటి వాడు కాలం ముందు తలవంచాల్సి వచ్చింది.
మేము అధికారం లో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ విషయం లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. అలా ఇన్వాల్వ్ అయితే ఇన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టేవి కావు.
రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు కాదు దేశ రాజకీయ ప్రయోజనాలు కావాలి.
కేసీఆర్ సపోర్ట్ తో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో మాకు అధికారం ముఖ్యం కాదు.
కేంద్రంలో మాకు రాహుల్ గాంధీ ప్రధాని కావడం ముఖ్యం. అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తాం.
పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండాలని నేను అధిష్టానం కు లేఖ రాస్తాం.
పీసీసీ గా మొదటి విడత లో శ్రీధర్ బాబు.. రెండవ విడతలో రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ ఇవ్వాలి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుక చౌదరి కి కేంద్రమంత్రి పదవిలు వస్తాయి.
5 సీట్లు గెలుస్తాము.
రేవంత్ రెడ్డి,
ఉత్తమ్ కుమార్ రెడ్డి,
రేణుక చౌదరి,
కోమటి రెడ్డి వెంకటరెడ్డి,
కొండ విశ్వే శ్వర్ రెడ్డి.