వాట్సాప్ నుంచి ఇన్ కమింగ్ కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్తగా ఉండండి.
గుర్తు తెలియన వ్యక్తి ఒక సారి రింగ్ చేసి మీఫోన్ లోకి స్పైవేర్ ను పంపించి, మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కంట్రోలకి తీసుకుంటారు.
ఆ రింగ్ మీ ఫోన్ లోకి స్పైవేర్ ఎక్కించే ప్రయత్నమై ఉండవచ్చు. ఇజ్రేల్ కంపెనీ ఒకటి తయారుచేసిన ఈ స్పైవేర్ ఏ ఫోన్ మీద నైనా దాడి చేయవచ్చు.
వాట్సాప్ వర్షన్ లో ఉన్న కొన్ని బలహీనతల వల్ల ఈ దాడులు జరగుతున్నాయని వాట్సాప్ గుర్తించింది. దీనిని వాట్సాప్ అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ కు , యూరోపియన్ యూనియన్ లోని తన రెగ్యులేటర్ కు తెలియ చేసింది. అందుకే, యూజర్లంతా వెంటనే వాట్సాప్ కొత్త వర్షన్ కు అప్ గ్రేడ్ కావాలని వాట్సాప్ ప్రకటిచింది.
కొన్ని ఫోన్ లలోకి యూజర్లకు తెలియకుండా స్పై వేర్ వైరస్ ఎంటర్ అయిందని, అది బీభత్సం సృష్టించేలోపే కొత్త వర్షన్ కు మారండని హెచ్చరింది. ‘వాట్సాప్ మెసేజింగ్ యాప్ ను వాడుతున్నావాళ్లంతా వెంటనే కొత్త వర్షన్ లోకి మారేందుకు వాట్సాప్ సహకరిస్తుంది. అదే విధంగా మొబైల్ డివైస్ లలో ఉన్న ఇన్ ఫర్మేషన్ ను కాపాడుకునేందుకు ప్రజలు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా అప్ డేట్ చేసుకోవాలి,’ వాట్సాప్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
ఇలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు ఇండస్ట్రీ పార్ట్ నర్లతో కలసి వాట్సాప్ పని చేస్తూ ఉందని ఈప్రతినిధి ప్రకటించారు.
గత ఆదివారం యుకె లోకి ఒక మానవహక్కుల న్యాయవాది పోన్ లోకి ఈ స్పైవేర్ చొరబడటంతో విషయం బయటకు పొక్కింది. ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న అనుమానం వున్నవారి ఫోన్ లో ఈ స్పైవేర్ ను పంపించి మొబైల్ ఫోన్ అపరేటింగ్ సిస్ట్ మ్ అదుపులోకి తీసుకుంటాయి.
ఇప్పటి వాట్సాప్ వర్షన్ లో ఉన్న బలహీనతలను ఆసరా చేసుకుని ఎవరైనా స్పైవేర్ ఇంజక్టు చేయవచ్చని ఫైనాన్సియల్ టైమ్స్ రాసింది. వాట్సాప్ కాల్ ఫంక్షన్ వాడే వాళ్ళను టార్గెట్ చేసుకుని వాళ్ల కి రింగ్ చేసి ఈ దాడి చేయవచ్చు. అయితే,ఇంతవరకు ఎన్ని ఫోన్ లు ఈ స్పైవేర్ కు బలయ్యాయో వాట్సాప్ వివరించలేదు.
ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ స్పైవేర్ ను ఇజ్రేల్ సైబర్ సర్వైలాన్స్ కంపెనీ ఎన్ ఎస్ వొ(NSO) రూపొందించింది. అయితే, ఈ టెక్నాలజీని నేరాలను, తీవ్రవాద చర్యలను అడ్డుకునేందుకు ప్రభుత్వం సంస్థల కోసం డెవెలప్ చేసినట్లు ఎన్ ఎస్ వొ అంగీకరించింది. ఎన్ ఎస్ వొ స్వయంగా ఈ టెక్నాలజీని ఎవరి మీద ప్రయోగించడంలేదని చెబుతూ ఉంది. ఇది కేవలం కొన్ని ప్రభుత్వాలకు, ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రమే వాడేందుకకు అనుమతి ఉంది. తనంతకు తానుగా ఇది పనిచేయదని కూడా ఎన్ ఎస్ వొ స్పష్టం చేసింది. (ఫోటో Financial Times). ఎవరైనా దుర్వినియోగం చేస్తూ ఉంటే తాము విచారించి చర్యలుతీసుకుంటామని కూడా ఎన్ ఎస్ వొ తెలిపింది.