దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కి.మి నుండి 2.1 కి.మి మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
రాయలసీమ నుండి కోమోరిన్ ప్రాంతం వరకు 0.9 కి.మి ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఇళా ఉంటుంది
తెలంగాణ:
ఈ రోజు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు(గంటకు 30 నుండి 40 కి.మి) తో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణ మరియు తూర్పు తెలంగాణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్ర:
రాగల మూడురోజులు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు(గంటకు 30-40 కి.మి) తో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు(గంటకు 30-40 కి.మి) తో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.