పదవ తరగతి పరీక్షల ఫలితాలు రేపు ఉ. 11.30 కు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫలితాల ప్రభావంతో పిల్లలు క్రుంగిపోకుండా చూడాలని తెలంగాణ బాలల హక్కుల సంఘం పరీక్షలు రాసిన విద్యార్ధినీ, విద్యార్ధుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. (ఫలితాలను రేపు bse.telangana.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చు.)
ఈ విషయంలో తల్లితండ్రులకు తాము అండగా ఉంటామని, తమని సంప్రదించాలని కూడా సంఘం తెలిపింది. ఈ మేరకు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ఒక ప్రకటన చేశారు. ప్రకటన కింద ఉంది.
పదవ తరగతి పరీక్ష రాసిన మీ పిల్లల ఫలితాలు విడుదల కాబోతున్నందున మీకు ఎన్ని పనులున్నా ఈ రోజు మీ పిల్లల తొనే వుండండి, మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వారిని నిందించకండి. ఈ మార్కులు వారి జ్ఞానానికి కొలబద్ద కాదు, అలాగే ఇవి కేవలం ఈ రొజు వచ్చిన మార్కులు కావు, సంవత్సరం కృషి, పది సంవత్సరాల పునాది ఈ కాలంలో మీ పిల్లలు ఎదుర్కొన్న వడి దొడుకులు పిల్లల చదువు పై ప్రభావం చూపిస్తాయి,మీరు మాత్రం పక్కింటి, ఎదురింటి, పిల్లల,స్నేహితులతో పోల్చి నిందించకండి, పరిక్షలు ఒక సారి తప్పితే మరోసారి రాయవచ్చు. కానీ ప్రాణం తిరిగి రాదు జీవితంలో ఏది సాధించాలన్నా మనం జీవించి వుండాలని పిల్లల కు చెప్పండి.
మీ పిల్లలు వంటరిగా, ముభావంగా వుంటే వెంటనే నిపుణులైన సైకాలజిస్ట్ ల వద్దకి తీసుకు వెళ్ళండి. మీ పిల్లలు ఏ మాత్రం ఆందోళన చెందినా బాలల హక్కుల సంఘాన్ని 9391024242 సంప్రదించండి. బాలల హక్కుల సంఘం మీకు తోడుగా వుంటుంది.